Wrestler Narsingh Yadav
-
నా మనసు చెబుతోంది అది కుట్రేనని...
న్యూఢిల్లీ: ఆ మచ్చే లేకుంటే మహారాష్ట్ర కుస్తీ వీరుడు నర్సింగ్ యాదవ్ ‘డబుల్ ఒలింపియన్’ రెజ్లర్ అయ్యేవాడు. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమనే వాపోతున్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు. (విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్) గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్‌ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్ సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది. గతం గతః... పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తొవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా అభిమతం’ అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. (బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’) -
రెజ్లర్ నర్సింగ్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ : డోపింగ్ కేసులో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ... త్వరలో రెజ్లింగ్ బరిలోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను డోపింగ్ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని కడదాకా పోరాడతానని యాదవ్ ఇది వరకే ప్రకటించాడు. కాగా నర్సింగ్ యాదవ్‌పై డోపింగ్ ఆరోపణలతో అతడిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ నాలుగేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒలింపిక్స్ నుంచి అతడు చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు భారత డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా).. క్రీడల అర్బిట్రేషన్ కోర్టు (కాస్)లో సవాల్ చేయగా.. విచారణలో నర్సింగ్ దోషిగా తేలాడు. మరోవైపు డోపింగ్ ఆరోపణలతో అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
టెన్షన్ వదిలేయ్.. పతకం 'పట్టు' : ప్రధాని మోదీ
డోపింగ్ వివాదం నుంచి బయటపడి రిలాక్స్ అవుతున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డోపింగ్ వివాదం, కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడ్డ తర్వాత రియోకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని మోదీని నర్సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు. మోదీతో భేటీ తర్వాత నర్సింగ్ మీడియాతో మాట్లాడారు. మోదీ తనతో మాట్లాడుతూ... 'ఇక ఉత్సాహంగా ఒలింపిక్స్ లో పొల్గొనాలి. టెన్షన్ పడవద్దు.. కుస్తీలో పట్టుపట్టి ఒలింపిక్స్ లో పతకం పట్టుకురావాలి' అని తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని నర్సింగ్ వెల్లడించాడు. అంతా మంచి జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాము చూస్తామని మోదీ ఉత్సాహాన్ని నింపారని నర్సింగ్ తెలిపాడు. ఒలింపిక్స్ లో పాల్గొంటానని తాను బలంగా విశ్వసించానని, దేశం కోసం కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని ధీమా వ్యక్తంచేశాడు. డోపింగ్‌లో పట్టుబడిన నర్సింగ్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్కు లైన్ క్లియర్ అయింది. -
నర్సింగ్పై నిర్ణయం రేపు
న్యూఢిల్లీ: నిర్దోషిగా తేలితే రియో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఆశపడుతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కోరిక తీరేలా కనిపించడం లేదు! అతని భవిష్యత్తు తేల్చాల్సిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తీర్పును మరోసారి వాయిదా వేసింది. నర్సింగ్పై తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. -
తీర్పు ఎప్పుడు వస్తుందో!
స్పష్టత ఇవ్వని ‘నాడా’ న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ ఉదంతంపై విచారణ పూర్తి చేసిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పు విషయంలో మాత్రం ఏటూ తేల్చడం లేదు. శని లేదా సోమవారాల్లో తీర్పు వెలువరిస్తామని చెప్పినా ఇందులోనూ స్పష్టత కరువైంది. ఈ విషయంపై నాడా, నర్సింగ్ తరఫు న్యాయవాదులను సంప్రదించినా ప్యానెల్ తీర్పు ఎప్పుడు ఇస్తుందో తమకూ తెలియదని చెప్పారు. దీంతో నర్సింగ్ రియో ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై రెజ్లింగ్ సమాఖ్యకు కూడా ఎలాంటి సంకేతాలు అందడం లేదు. ఒలింపిక్ విలేజ్‌కు భారత్ అథ్లెట్లు రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ కోసం ఇప్పటికే బ్రెజిల్‌కు వచ్చిన భారత అథ్లెట్లు... ఒలింపిక్ విలేజ్‌కు చేరుకుంటున్నారు. భారీ భారత బృందంలో ఇప్పటికే సగం మంది ఇక్కడికి చేరుకున్నారు. అథ్లెట్లు ముందుగా రావడం వల్ల ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడుతున్నారని చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా అన్నారు. ఆగస్టు 2న భారత అథ్లెట్లకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. -
నర్సింగ్ 'డోపింగ్' వివాదంపై కేసు నమోదు
సోనేపట్: మరి కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయనగా భారత క్రీడారంగాన్ని కుదిపేసిన డోపింగ్ వ్యవహారంలో మొదటి కేసు నమోదయింది. హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నిర్వహించిన శాంపిల్ పరీక్షల్లో డోపీగా తేలిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. తాను తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ ఫిర్యాదును అనుసరించి ఐపీసీ సెక్షన్ 328, 120 బిల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సోనేపట్ డీఐజీ హెచ్ ఎస్ డూన్ బుధవారం మీడియాకు తెలిపారు.(అయ్యో... నర్సింగ్!) సోనేపట్ సాయ్ కేంద్రంలో తాను తిన్న ఆహారంలో ఓ జూనియర్ రెజ్లర్ల డ్రగ్స్ కలిపి ఉంటాడని నర్సింగ్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేంద్రంలో డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. సదరు నిందితుడైన టీనేజర్.. సుశీల్ కుమార్ బృందంలో ఒకడని వెల్లడికావడంతో కుట్రలో సుశీల్ కుమార్ కూడా భాగస్తుడేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితులుగా తేలినవారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని డీఐజీ డూన్ అన్నారు. (నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!) నర్సింగ్ యాదవ్ నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అతని ఒలింపిక్ బెర్త్ రద్దైన సంగతి తెలిసిందే. -
నర్సింగ్పై కుట్ర జరిగింది
-
నర్సింగ్పై కుట్ర జరిగింది
♦ ‘సాయ్’ అధికారిపై రెజ్లర్ అనుమానం ♦ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ వెల్లడి ♦ ‘నాడా’ క్లీన్చిట్ ఇస్తేనే ‘రియో’లో బరిలోకి ♦ ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం ♦ డోప్‌లో దొరికిన నర్సింగ్ సహచరుడు సందీప్ న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బాసటగా నిలబడింది. రియో ఒలింపిక్స్‌కు వెళ్లకుండా నర్సింగ్పై కుట్ర జరిగిందని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. డోపింగ్‌లో విఫలమైన సమాచారం అందుకున్న వెంటనే ఈనెల 19న నర్సింగ్ యాదవ్ డబ్ల్యూఎఫ్ఐకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడన్నారు. హరియాణాలోని సోనెపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో శిక్షణ శిబిరం సందర్భంగా తాను తీసుకున్న ఆహారంలో ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని... ఈ కుట్ర వెనుక ‘సాయ్’ అధికారితోపాటు శిబిరంలో ఉన్న ఇతర ఆటగాళ్ల పాత్ర ఉందని నర్సింగ్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ‘నెల రోజుల వ్యవధిలో నర్సింగ్కు మూడు డోప్ టెస్టులు నిర్వహించడం అనుమానం రేకెత్తిస్తోంది. నర్సింగ్ ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న మరో రెజ్లర్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోపింగ్‌లో పట్టుబడటం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. నర్సింగ్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దానిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించాం. ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులకు ఈ సమాచారాన్ని అందించాం. నర్సింగ్పై కుట్ర జరిగిన విషయాన్ని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యతోపాటు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు వివరించాం’ అని ఆయన అన్నారు. తుది విచారణ తర్వాతే... రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పాల్గొంటాడా లేదా అనే విషయం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ‘నాడా క్లీన్చిట్ ఇస్తేనే నర్సింగ్‌ను రియో ఒలింపిక్స్‌కు పంపిస్తాం. ఇప్పటికైతే అతనిపై తాత్కాలిక నిషేధం విధించాం. విచారణ సందర్భంగా తన వాదన వినిపించేందుకు నర్సింగ్కు పూర్తి అవకాశం ఇస్తాం’ అని విజయ్ గోయల్ తెలిపారు. మరో రెజ్లర్ కూడా... సోనెపట్ ‘సాయ్’ కేంద్రంలో నర్సింగ్ యాదవ్‌కు ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న సందీప్ తులసీ యాదవ్ కూడా నిషేధిత ఉత్ప్రేరకం మెథన్‌డైనోన్ వాడినట్లు తేలింది. మహారాష్ట్రకే చెందిన సందీప్ 2013లో హంగేరిలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. దురదృష్టకరం: సుశీల్ భారత రెజ్లింగ్‌లో డోపింగ్ వివాదం దురదృష్టకర పరిణామమని బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వ్యాఖ్యానించాడు. ‘భారత రెజ్లింగ్‌కు ఈ దుస్థితి రావడం దురదృష్టకరం. నా కెరీర్లో నా సహచర రెజ్లర్లకు ఎప్పుడూ మద్దతుగా నిలిచాను. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలని ఆశించాను. అయితే గత నెల రోజులుగా నేను ప్రాక్టీస్ చేయడంలేదు. రియోలో నా సహచరులు పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సుశీల్ తెలిపాడు. ‘సీబీఐ విచారణ జరిపించాలి’ డోపింగ్ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డిమాండ్ చేశాడు. రియో ఒలింపిక్స్‌కు తాను ఎంపికైన వ్యవహారం కోర్టు దాకా వెళ్లిందని, సోనెపట్ శిక్షణ కేంద్రంలో పాల్గొంటే తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో సీఐడీ నివేదిక ఇచ్చిందని అతను గుర్తు చేశాడు. ‘నాడా’ విచారణ సంఘం సభ్యులకు అన్ని వివరాలు వెల్లడిస్తానని, తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని, ఇప్పటికీ తాను ఒలింపిక్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని నర్సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.