వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!
తెలుగు వారి ఉగాది పండుగను విదేశాల్లో ఉన్న భారతీయ తెలుగు ప్రజలు కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని ఈ పండుగ సందర్భంగా భారత్లో జరిగినట్లే కవి సమ్మేళనాలు, రచనల పోటీలు వంటి వాటిని విదేశాల్లోని తెలుగు ప్రజల కమ్యూనిటీలు నిర్వహిస్తున్నాయి. పైగా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సగర్వంగా చేసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలనే అమెరికాలోని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించి ఉగాది వేడుకులను ఘనంగా చేసుకున్నారు.
ఈ మేరకు క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ఉగాది ఉత్తమ రచనలు పోటీలు నిర్వహించారు. ఇలా ప్రతి ఏడాది పెట్టడం జరుగుతుంది. ఈసారి జరిగినవి 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీలు. ఈ పోటీల్లో ఉత్మ రచనలుగా ఎంపికయ్యిన వాటి వివరాలను వెల్లడించారు నిర్వాహకులు. ఇక ఈ పోటీల్లో అమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా మొదలైన పలు దేశాల నుంచి భారతీయులు పాలు పంచుకోవడం విశేషం. ఈ పోటీల్లో “నా మొట్టమొదటి కథ”, “నా మొట్టమొదటి కవిత” విభాగాలకు ఎక్కువమంది పోటీపడడ్డారు.
ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ..అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, ‘మధురవాణి. కామ్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించడం జరుగుతుంది. ఈ పోటీకి ఆర్ధిక సహకారం అందించిన మునుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్)కి అందరి తరఫునా ధన్యవాదాలు అని చెప్పారు. కాగా, ఈ పోటీల్లో ఎంపికైన రచనలు, కవితలు, కథల వారిగా వివరాలు ఇలా..!
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
‘ఓర్నీ అమ్మ’’- శర్మ దంతుర్తి (Elizabeth Town, OH) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“అసంకల్పిత ప్రతీకారాలు”- పాణిని జన్నాభట్ల (Boston, MA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
‘వలస కూలీలు’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL- ప్రశంసా పత్రం
‘వైకుంఠపాళీ’- మధు పెమ్మరాజు (Katy, TX) -ప్రశంసా పత్రం
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“కవిత్వం” - గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“పశ్ర్న”- శ్రీధర్ బిల్లా, Fremont, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఎంకి నాయుడు బావ”- మణి మల్లవరపు (Vancouver, Canada) ప్రశంసా పత్రం
“మొట్టమొదటి రచనా విభాగం” -16వ సారి పోటీ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
‘వేలెత్తి చూపిన పిల్లి’ - జీ.కే. సుబ్రహ్మణ్యం ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
‘రేసు గుర్రం - కోరుకొండ దుర్గాబాయి ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
పల్లెకు పోదాం ఛలో, ఛలో- రాపోలు సీతారామరాజు - ప్రశంసా పత్రం
"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“విరహ ప్రస్థానం”- దాసశ్రీ (దేవేంద్ర దాసరి) పెద్దహరివనం, కర్నూలు ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“నీవు ఎవరు? కాస వైశ్విక (తిర్మలాపూర్, జగిత్యాల జిల్లా) ($116 నగదు పారితోషికం (ప్రశంసా పత్రం)
కాలంతో కరచాలనం రిషిత్ సిరికొండ గొల్లపల్లి, జగిత్యాల జిల్లా (ప్రశంసా పత్రం)
తదితర రచనలు, కవితలు,క థలను ఎంపికయ్యాయి. ఇక ఈ పోటీలకు సహకరించిన న్యాయ నిర్ణేతలకి, అలాగే ఇందులో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలని చెప్పారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినవారు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు తదితరులు.
(చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!)