yadagiri
-
బదిలీ, ఘన వీడ్కోలు.. అంతలోనే కన్నుమూత
రాయచూరు రూరల్: యాదగిరి నగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం (29) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేశారు. వివరాలు... యాదగిరి ఎస్ఐగా పనిచేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాత్రి ఆయనకు అందరూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లి నిద్రించిన ఆయన నిద్రలోనే చనిపోయారు. మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ సంగీత ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.ఎమ్మెల్యేకు రూ. 30 లక్షలు ఇచ్చాం: భార్యపరశురాం భార్య శ్వేత మీడియాతో మాట్లాడారు. తన భర్త పరశురాం బదిలీ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల క్రితం రూ. 30 లక్షలు ఇస్తే యాదగిరి పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు ముగిశాక తిరిగి యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నట్లు శ్వేత చెప్పారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఇదిలా ఉంటే ఎస్ఐ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.మరణంపై విచారణ: హోంమంత్రిశివాజీనగర: యాదగిరి ఎస్ఐ పరశురాం మరణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనిఖీ చేపట్టాలని సూచించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎస్ఐ సతీమణి శ్వేతా ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఐ బదిలీ గురించి స్థానిక ఎమ్మెల్యే ఒకరిపై ఆమె ఆరోపించారు. పరశురాం మరణం సహజమైనది. ఆత్మహత్య కాదు. ఎలాంటి డెత్ నోట్లు లభించలేదని అన్నారు. బదిలీ కావడంతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని తోసిపుచ్చబోమన్నారు. కాగా, బీజేపీ– జేడీఎస్ పాదయాత్రకు షరతులను విధించడమైనది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగరాదు. ప్రజలకు ఇబ్బంది కారాదని హోంమంత్రి తెలిపారు. వారు కోర్టుకు వెళ్లేలోపు తామే పాదయాత్రకు అనుమతి ఇచ్చామని తెలిపారు. -
అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో నీటి లీకేజీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఈ బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుంచి నీళ్లు లీకవుతున్నట్టుగా బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈఈ యాదగిరి వివరణ ఇచ్చారు. బ్యారేజీ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్ ఉంటుందని.. దీనికి వార్షిక నిర్వహణ (ఓఅండ్ఎం)లో భాగంగానే పనులు చేస్తున్నామని తెలిపారు. ఏటా సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుందని, సీపేజ్ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు. పూర్తి నిర్వహణ బాధ్యత అఫ్కాన్ సంస్థదేనని తెలిపారు. ప్రాజెక్టును ఇలాంటి సమస్యలను తట్టుకునే విధంగానే డిజైన్ చేశామన్నా రు. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా చేస్తామన్నారు. కాగా బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 5.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి.. చివరికి అనాథలైన పిల్లలు!
సంగారెడ్డి: తల్లిదండ్రుల మృతితో ఆ పిల్లలను రోడ్డున పడేశాయి. అనారోగ్యంతో రెండేళ్ల కిందట తల్లి చనిపోగా.. అదే అనారోగ్యం తండ్రినీ పొట్టనపెట్టుకుంది. దీంతో ముగ్గురు చిన్నారుల పరిిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాలకు చెందిన దొడ్డి యాదగిరి (42), రేణుక (35)లకు ముగ్గురు ఆడపిల్లలు. 2021లో రేణుక అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి పిల్లల బాగోగులు తండ్రి చూసుకునేవాడు. అంతలోనే యాదగిరి తల్లి బాల ఎల్లవ్వ కూడా మృతిచెందింది. కాగా కొద్దిరోజులుగా యాదగిరి కూడా మంచం పట్టాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతిచెందాడు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రులతో పాటు నానమ్మ కూడా మృతిచెందడంతో చిన్నారులు అనాథలయ్యారు. శిరీష 8వ తరగతి, శ్రావణి నాలుగు, రిషిక రెండో తరగతి చదువుతున్నారు. పిల్లల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ఎవరూ లేని ఈ పిల్లలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాతలు సాయం అందించాలనుకుంటే 9550940672లో సంప్రదించాలని తెలిపారు. -
Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి నియామకయ్యారు. ఈ నేపథ్యంలో వీసీ రవీందర్ స్పందిస్తూ రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీకి లేదన్నారు. దీంతో, రిజిస్ట్రార్ కుర్చీలో ప్రొ. కనకయ్యను వీసీ కూర్చెబెట్టారు. ఇదిలా ఉండగా.. అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలకమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని కొత్త సచివాలయంలో తెయూ 59వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ హాజరు కాకపోవడంతో సమావేశానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ చైర్మన్‌గా వ్యవహరించారు. గత నెల 19, 26, ఈ నెల 5, 12వ తేదీల్లో వరుసగా నిర్వహించిన 55, 56, 57, 58 సమావేశాల్లో చేసిన తీర్మానాల విషయమై సమావేశంలో సమీక్షించారు. 60వ సమావేశాన్ని జూన్ 3న నిర్వహించాలని, అదేవిధంగా వర్సిటీకి రిజిస్ట్రార్‌గా యాదగిరిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 15న వర్సిటీలోని రిజిస్ట్రార్ గదికి తాళం తీయించకుండా చేయడంతో అప్పటి నుంచి రిజిస్ట్రార్ యాదగిరి ఆ చాంబర్‌కు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యాదగిరి కొనసాగింపు గురించి ప్రస్తావించారు. అయితే సమావేశానికి యాదగిరి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా వీసీ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పాలక మండలి సమావేశంలో సమీక్షించిన అంశాల్లో వీసీ అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు కేసులు, ముగ్గురు రిజిస్ట్రార్ల నుంచి దుర్వినియోగమైన నిధుల రికవరీ, విద్యావర్ధిని సస్పెన్షన్, సర్వీసు పుస్తకాల టాంపరింగ్ అలాగే కనకయ్యపై పెట్టాల్సిన క్రిమినల్ కేసులు, బడ్జెట్, ఐదుగురు సభ్యుల బృందం చేయాల్సిన దర్యాప్తు తదితర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నసీమ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట -
విద్యుద్దీపాల వెలుగులతో యాదాద్రి క్షేత్రం.. (ఫొటోలు)
-
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
తెలంగాణ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌పై వేటు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ 5 గంటలపాటు పాలకమండలి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. పదేళ్ల అనుభవం అవసరమైన సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న కనకయ్య తనకు తానే ఆర్డర్లు ఇచ్చుకుని, పాలకమండలి అప్రూవల్ అయినట్లుగా ప్రకటించుకొని యూజీసీ నిబంధనలను అతిక్రమించారని నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్ చూపించమని అడిగినా కనకయ్య చూపించలేకపోయారు. దీంతో కనకయ్య సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు అనర్హుడని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. కనకయ్యపై క్రమశిక్షణ చర్యల కోసం అప్పటికప్పుడే ఛార్జ్ మెమో తయారు చేశారు. అక్కడికక్కడే ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఛార్జ్ ఇప్పించి కనకయ్యను సమావేశం నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా సీనియారిటీ లేని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజును కూడా పాలకమండలి సమావేశం నుంచి నవీన్ మిట్టల్ బయటకు పంపారు. గత నెలలో అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన 113 మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా ప్రెస్మీట్లో ప్రకటించారు. బోధన సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో అన్నిరకాల డిప్యుటేషన్లను రద్దు చేసి అందరినీ వెనక్కు పిలవాలని మిట్టల్ ఆదేశించారు. నవంబర్ 1 నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, ఇన్చార్జి రిజిస్ట్రార్ వ్యవహారాలపై ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలను కొందరు పాలకమండలి సభ్యులు బుక్లెట్ రూపంలో నవీన్ మిట్టల్‌కు అందించగా వీటిపై చర్చ జరిగింది. -
యాదగిరీశుడికి చక్రతీర్థ స్నానం...
-
విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభిలాష్ అనే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కొంత కాలంగా తన ఇంటివద్ద నుంచే వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రెండు రోజుల అతన్ని సదరు కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందించింది. ఉద్యోగం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అభిలాష్ మణికట్టును కత్తితో కోసుకొని అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, కుటంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. (మంత్రి కేటీఆర్, మేయర్‌పై సుమేధ తల్లి ఫిర్యాదు) -
6 నుంచి 10 తరగతులకు డిజిటల్ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యా బోధన ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉన్నత తరగతులైన 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలను (వీడియో పాఠాలను) ప్రసారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా వారికి వర్క్షీట్లు అందజేసి, అసైన్మెంట్స్ ఇవ్వడం ద్వారా విద్యా కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రతిపాదనలను రూపొందించింది. అన్ని తరగతులకు సంబంధించి 900కు పైగా డిజిటల్ పాఠాలు ఇప్పటికే రూపొందించి ఉన్నందున వాటిని టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) చానళ్ల ద్వారా ప్రసారం చేస్తూ విద్యా బోధనను అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాల బోధనకు కసరత్తు చేస్తోంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం ముందుకుసాగాలని, లేదంటే ఆగస్టు 15 నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రభుత్వం సరేననగానే వీడియో పాఠాల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యక్ష విద్యా బోధనపై విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై స్పష్టత, సమగ్ర మార్గదర్శకాలు జారీ అయ్యాకే, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకుసాగాలని భావిస్తోంది. డిజిటల్ పాఠాల టైం టేబుల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ప్రజ్ఞత’పేరుతో జారీచేసిన ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ టైంటేబుల్‌ను సిద్ధంచేసింది. తరగతుల వారీగా, రోజువారీగా ఏయే సమయాల్లో ఏయే సబ్జెక్టు పాఠాలను ప్రసారం చేయాలనే వివరాల్ని ఇందులో పొందుపరిచింది. రోజూ ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఈ విద్యా బోధన ఉండాలని కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ దిశగానే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఉన్నత తరగతులకు గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే బోధించేలా చర్యలు చేపట్టనుంది. అదీ ఒక్కో సెషన్ 30 నుంచి 45 నిమిషాలే ఉండేలా టైంటేబుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రైమరీ తరగతులకు వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ ప్రాథమిక తరగతులను (1 నుంచి 5వ తరగతి వరకు) వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ పద్ధతుల్లోనే కొనసాగించాలని ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వారికిప్పుడు రెగ్యులర్ తరగతుల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వీడియో పాఠాలు ప్రసారం చేసినా ప్రాథమిక తరగతుల విద్యార్థులు శ్రద్ధగా వినే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ ఇవ్వడం వంటి యాక్టివిటీని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొంత మంది టీచర్లను స్కూళ్లకు పంపించడం ద్వారా ప్రాథమిక తరగతులకు కూడా విద్యా కార్యక్రమాలను కొనసాగించవచ్చని పేర్కొంది. అనుమానాల నివృత్తికి ప్రత్యేకంగా ఒకరోజు టీవీ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను వినే క్రమంలో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి ఒక్కో తరగతికి ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో టీచర్లతో పాటు వారి ఫోన్ నంబర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. పాఠశాల స్థాయిలో ఫోన్ సదుపాయం ఉన్న విద్యార్థులు, సబ్జెక్టు టీచర్లతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి అందుబాటులో ఉంచేలా, మండల స్థాయిలో సబ్జెక్టు గ్రూపులను ఏర్పాటుచేసేలా ప్రణాళికలు వేసింది. గ్రామాల్లో టీవీ, ఫోన్ సదుపాయం లేని విద్యార్థులుంటే వారు స్కూల్‌కు వెళ్లి నేర్చుకునేలా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీచర్లను రొటేషన్ పద్ధతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామపంచాయతీ సౌజన్యంతో అలాంటి విద్యార్థుల కోసం ఒక టీవీని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించడం ద్వారా ఆయా విద్యార్థులకు వీడియో పాఠాలను అందించవచ్చని భావిస్తోంది. ఇక పాఠశాలల్లో టీచర్లను ఎంతమందిని అందుబాటులో ఉంచాలి?, లేదా అందరినీ స్కూళ్లకు పంపించాలా? అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థుల కోసం మాత్రం రొటేషన్ పద్ధతిలో కొంతమంది టీచర్లను మాత్రం కచ్చితంగా పాఠశాలల్లో ఉంచాలని పేర్కొంది. -
ఆక్సిజన్ పెట్టకుండానే బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకం ఇంకా మరిచిపోకముందే... తాజాగా గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పేరుతో ఎన్నారై వైద్యురాలికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో లేని స్పెషాలిటీ వైద్యులు వచ్చి రోగికి చికిత్సలు అందించినట్లు, ఖరీదైన మందులు వాడినట్లు, వెంటిలేటర్ అమర్చినట్లు...ఇలా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి..సదరు వైద్యురాలు షాక్‌కు గురైంది. ఇదెక్కడి ఘోరం అంటూ సెల్ఫీ వీడియో తీసి బయటికి వదలడంతో అది వైరల్ అయింది. అసలేమైందంటే... మూత్రనాళ సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న నగరానికి చెందిన యాదగిరిరావు కేసరిని చికిత్స కోసం జూన్ 25న గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనతో పాటే ఆయన కుమార్తె , ఎన్నారై డాక్టర్ విజయకేసరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు టెస్టులు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్ విజయకేసరి కూడా టెస్టు చేయించుకోగా, ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె కూడా ఇదే ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిటయింది. నిజానికి వీరిద్దరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేవు. కానీ ఆస్పత్రి సిబ్బంది వారికి మెడికేషన్ ఇచ్చినట్లు, ఆక్సిజన్ పెట్టినట్లు బిల్లు వేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు బదులు ఫల్మొనాలజీ వైద్యుడిగా పేరు మార్చి అదనంగా మళ్లీ బిల్లు వేశారు. అదేమని అడిగితే.. నాలుగు రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌గారు దయచేసి కాపాడండి!.. అంటూ సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు వీడియో వైరలైంది. ఇది అనైతికంః డాక్టర్ విజయకేసరి, బాధితురాలు మా నాన్నకే కాదు నాక్కూడా ఒక్క సింప్టమ్ కూడా లేదు. నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు, ఐవీ ఇచ్చినట్లు, ఆక్సిజన్ ఇచ్చినట్లు బిల్లు వేశారు. నిజానికి విటమిన్ సి, మల్టీవిటమిన్, యాంటి బయోటిక్ టాబ్లెట్స్ మినహా మరే ఇతర మందులు కానీ, ఇంజక్షన్లు కానీ ఇవ్వలేదు. రాని డాక్టర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లు వేశారు. అదేమని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదు. ఇండియాలో ఇదెక్కడి ఘోరం? ఇంత దారుణమా? అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరికీ..14 రోజులకు రూ.2.96 లక్షలేః ఏఐజీ ఆస్పత్రి తండ్రితో పాటు డాక్టర్ విజయ కూడా కోవిడ్ పాజిటివ్‌తో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసోలేషన్‌లో భాగంగా తండ్రి కుమార్తెలిద్దరూ వేర్వేరు రూమ్‌లను ఎంచుకున్నారు. తాను ఎన్నారై డాక్టర్‌నని, తనకు ప్రత్యేక రూమ్ కావాలని చెప్పిరోజుకు రూ.12 వేలు అద్దె ఉన్న గదిని ఎంచుకున్నారు. తండ్రికి రూ.ఆరు వేలు ఉన్న గదిని ఎంచుకున్నారు. వీరిద్దరి రూమ్‌రెంట్, మందులు, వైద్యుల ఛార్జీ ఇలా 14 రోజులకు మొత్తం రూ.2.96 లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. ఆ బిల్లు చెల్లించడం ఇష్టం లేకే ఆమె ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తోందని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. -
సమస్యలతో పోరాడలేను.. శాశ్వతంగా కన్ను మూస్తున్నా!
చైతన్యపురి: ‘తప్పులు సరిచేసుకుంటూ జీవితంలో ఒంటరి పోరాటంతో ముందుకు పోతుంటే.. ఓపిక నశించింది.. ఫలితాలు తీసుకునే సమయంలో సమస్యలు పెరిగిపోతున్నాయి.. నన్ను చాలా మంది వాడుకున్నారు.. అబద్ధాలు ఆడే ఓపిక నాకిక లేదు.. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా’నంటూ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కార్యాలయంలోనే ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం.. నకిరేకల్ చిత్తలూరుకు చెందిన ఎద్దు యాదగిరి (55) హైదరాబాద్‌కు వచ్చి నాగోలులో షణ్ముఖ మార్కెటింగ్ సర్వీసెస్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సమతాపురి కాలనీలో నివసించే ఆయనకు భార్య జ్యోతి, కుమారుడు పవన్ సాయి, కూతురు నిఖిత ఉన్నారు. కుమారుడు పవన్ సాయి పదిరోజుల క్రితమే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కార్యాలయానికి వచ్చిన యాదగిరి తన సెల్ఫోన్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డు చేసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. సమస్యలతో పోరాడలేను... శాశ్వతంగా చనిపోతున్నానని ఫోన్లో రికార్డు చేసి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. ఉదయం 9 గంటలకు కార్యాలయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు యాదగిరి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యాపార భాగస్వాములు మోసం చేయటం వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కూతురు నిఖిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్ వీడియో: ఘోర ప్రమాదం
శుభకార్యంలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఓ తల్లీకుమారుడిని మృత్యువు కబళించింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యానికి కనుమూసి తెరిచేలోపే రెండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపుర్ గ్రామానికి చెందిన గొర్రెంకల ధనమ్మ(50), అతడి కుమారుడు యాదగిరి(24) శుక్రవారం బైక్‌పై నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. శనివారం స్వగ్రామం చిత్తాపుర్కు బైక్‌పై బయలుదేరారు. మృతదేహాలు చెల్లాచెదురుగా.. హైదారాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన ఓ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న తోర్పనూరి దానయ్య, భార్య పద్మతో కలిసి కారులో చండూరు మండలంలోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో కొత్తగూడెం స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న యా దగిరి, ధనమ్మల బైక్‌ను రాంగ్రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ సుమారు పది మీటర్ల ఎత్తుకు ఎగిరింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లీకుమారుడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, దానయ్య కారు కూడా అదుపుతప్పి సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారిద్దరికి గాయాలయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాద విషయం తెలుసుకున్న కొత్తగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్లీకుమారుడు విగతజీవులుగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ యాదవరెడ్డి ఘట న స్థలాన్ని పరిశీలించి తొలుత ప్రమాదంలో గాయపడిన దానయ, అతడి భార్య పద్మను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం మేరకు చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు కొత్తగూడెం చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటి పుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఆరు నెలల కిందటే వివాహం.. ప్రమాదంలో మృతిచెందిన ధనమ్మకు భర్త చంద్ర య్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు యాదగిరికి ఆరుమాసాల క్రితమే వివాహం జరిగింది. ఇతను ఫిలింసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు చౌటుప్పల్ ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
దసరాకు అదనపు బస్సులు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతామని టీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఎంజీబీఎస్‌లో విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడారు. తెలంగాణాతో పాటు ఆంధ్రా, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, పూణె ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్న సందర్భంగా 8వ తేదీ సాయంత్రం నుంచే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని వెల్లడించారు. 13,14 తేదీలతో పాటు 19న కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపేందుకు సిద్ధం చేశామని తెలిపారు. పండుగ సందర్భంగా 4480 బస్సులను అదనంగా తిప్పుతున్నామని చెప్పారు. తెలంగాణ జిల్లాలకు ఎక్కువ సర్వీసులు నడుపుతామని అన్నారు. ఓపీఆర్ఎస్ ఆధారంగా అదనపు బస్సులను ఇంటర్‌స్టేట్‌లకు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రద్దీ తగ్గించేందుకు నగర శివార్ల నుండి సర్వీసులను నడిపిస్తామని వెల్లడించారు. వరంగల్, యాదగిరిగుట్ట నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే నడుస్తాయని, ఉత్తర తెలంగాణ సర్వీసులను జేబీఎస్‌కే పరిమితం చేస్తామని తెలిపారు. రాయలసీమకు సీబీఎస్ హ్యాంగర్ నుంచి నడిపే వాళ్లం కానీ అది పడిపోయినందుకు ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తామని అన్నారు. కాచీగూడ బస్టాండ్ నుంచి స్పెషల్ బస్‌లను నంద్యాల, కడప, చిత్తూరు, నందికొట్కూరు ప్రాంతాలకు నడుపుతామని చెప్పారు. నల్గొండ జిల్లా బస్సులను దిల్సుఖ్నగర్ నుంచి, విజయవాడ రూట్ బస్సులు కూడా ఎంజీబీఎస్ నుంచి కాకుండా నగర శివార్ల నుంచి, కొన్ని ఆంధ్రా ప్రాంత సర్వీసులు ఎల్బీనగర్ నుంచి, తిరుపతికి ఎంజీబీఎస్ నుంచి నడుపుతామని వెల్లడించారు. 16,17, 18 తేదీల్లో ఎంజీబీఎస్ నుంచి సిటీ బస్సులను నగర శివార్లకు నడుపుతామని వివరించారు. సమాచారం లేక ఎంజీబీఎస్‌కు వచ్చేవారు ఈ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. బెంగుళూరు నుంచి వచ్చివెళ్లే వారికోసం 90 బస్సులు అదనంగా సిద్ధం చేశామని.. టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్పెషల్ సర్వీసులకు 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. -
ఆంధ్రా పాలనలోనే ఆర్టిస్టులకు గౌరవం: ఎక్కా యాదగిరి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఆర్టిస్టులు.. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్టిస్టులు కన్పించట్లేదు. ఆంధ్రోళ్ల పాలనలోనే గౌరవ, మర్యాదలు ఉండేవి’ అని అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పాలకుల పాలనలో అవార్డులు, ప్రోత్సాహకాలు ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ సర్కారు ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా శిల్పులకు, చిత్రకారులకు ఏం చేసిందని ప్రశ్నించారు. తమకు నిలువ నీడలేదని, పెద్ద పెద్ద ఆర్టిస్టులను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఆర్టిస్టులంతా చెట్టుకొకరం.. పుట్టకొకరం అయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కల్పించుకొని పెద్దలు సంయమనం వహించాలని కోరారు. మీ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. లలితకళల అకాడమీ ఏర్పాటు కావాల్సి ఉందని భవిష్యత్తులో ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. -
పట్టపగలు.. కత్తులు చూపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో పట్టపగలు దారిదోపిడీ చోటు చేసుకుంది. దుండగులు నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తులతో బెదిరించి వాహనం, సెల్ఫోన్లు, పర్సు లాక్కెళ్లారు. ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బేగంపేట శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన రాజబోయిన యాదగిరి బంజారాహిల్స్ రోడ్ నం.12లోని బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయంలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం సహోద్యోగి రాజేంద్ర మిశ్రాతో కలసి బైక్‌పై జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సాగర్ సిమెంట్స్ కార్యాలయానికి వచ్చాడు. యాదగిరి తన బైక్‌ను రోడ్డుకు ఎడమ వైపు నిలిపి ఉంచాడు. కుడివైపునున్న సాగర్ సిమెంట్స్ కార్యాలయంలోకి రాజేంద్ర మిశ్రా వెళ్లాడు. ఇంతలో హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు వచ్చి యాదగిరిని కత్తులతో బెదిరించి బైక్‌పై నుంచి కిందకు తోసేశారు. అతడి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు, పర్సును లాక్కుని, బైక్‌తో పారిపోయారు. తేరుకున్న యాదగిరి వారిని వెంబడించడానికి ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. యాదగిరి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగులు పారిపోయిన మార్గాల్లోని సీసీ కెమెరాలను అదనపు ఇన్స్పెక్టర్ కె.ముత్తు పరిశీలించారు. దుండగులు పంజగుట్ట మీదుగా బేగంపేట ఫ్లైఓవర్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. బేగంపేట ప్రాంతానికి చెందిన వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం శాంతిభద్రతల విభాగంతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. -
మృత్యువును ధిక్కరించిన పాట
మట్టి మనుషులు మనిషిలాగా బ్రతకాలని, మనిషిలాగా మరణించాలన్న కోరికని సామూహిక చైతన్యంగా మలచటంలో ప్రజా కళాకారుల పాత్ర ప్రముఖమైనది. ఆ ప్రజా కళాకారులకి గోసి, గొంగడి, గజ్జెలు కట్టి.. ప్రజలు పెట్టిన ముద్దుపేరు గద్దర్. తెలుగు కళా సాహిత్య చరిత్రలో శబ్దం ఒక విశాల వేదికను సృష్టించింది. అనేకమంది కవులను, కళాకారు లను, రచయితలను, చిత్రకారులను, జర్నలిస్టులను, ఫొటోగ్రాఫర్లను, మేధావులను, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ఒక వేదిక మీదకు తెచ్చింది. వీరి సృష్టిని, సృజనాత్మకతకు అద్దం పట్టింది శబ్దం. ఆనాడు ఆ శబ్దం గద్దర్ కోసం మార్మోగింది. పాటలై, కవితలై, కథలై, పద్యమై, గద్యమై, చిత్రమై, ప్రాణ గీతమై, డప్పుల సంగీతమై, గజ్జెల గానమై, మృత్యువుకు పెను సవాలై, అశేష పీడిత ప్రజల ఐక్య నినాదమై ప్రతిధ్వనిం చింది. గద్దర్ పాట దీనికి స్ఫూర్తి, గద్దర్‌పై పేలిన తూటా దాని సందర్భం. అది 6 ఏప్రిల్ 1997. నేటికి 20 ఏండ్లు. గద్దర్ పాటకు 60 ఏండ్లు. ‘‘భారతదేశం భాగ్య సీమరా–సకల సంపదకు కొదు వలేదురా/సకల సంపదలు కల్ల దేశమున దరిద్రమె ట్లుందో’’ ఇది గద్దర్ పాట. ఇది గద్దర్ ప్రశ్న. 50 ఏండ్లు నిండినా ఈ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. గుండెల్లో బుల్లెట్లు దించినా ఈ ప్రశ్న చచ్చిపోలేదు. ఇది భిన్న సంస్కృతుల దేశం. విభిన్న విశ్వాసాల సమాజం. అనేక భాషలు, వర్గాలు, కులాలు, జాతులు, ప్రాంతాలు, ఆహార అల వాట్లు, భిన్న సత్యాలు, అలవికాని మానవ ఆహార్య అందాలు కలిగి ఉన్న దేశం, అందుకే నిజమైన ప్రజాస్వా మ్యమే ఈ దేశానికి ధర్మం, మార్గం. నిజమైన ప్రజాస్వామ్యమే ఈ దేశ దరిద్రానికి పరిష్కారం. ఈ ప్రజాస్వామ్యం కోసం ఈ దేశ ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. భారతదేశ రాజ్యాంగ అమలు కోసం అనేకమంది రైతులు, కూలీలు, కార్మికులు, విద్యా ర్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆడవాళ్లు, అంటరాని వాళ్లు ప్రాణాల్ని అర్పించారు. ఈ మట్టి మనుషులు మనిషిలాగా బ్రతకాలని, మనిషిలాగా మరణించాలని కోరుకుంటున్నారు. ఈ కోరికని సాంస్కృతిక చైతన్యంగా, సామూహిక ప్రజా చైతన్యంగా మలచటంలో ప్రజా కళా కారుల పాత్ర ప్రముఖమైనది. ఆ ప్రజా కళాకారులకి గోసి, గొంగడి, గజ్జెలు కట్టి, ముద్దు పెట్టి ప్రజలు గద్దర్ అని పేరు పెట్టారు. ‘‘యాలరో ఈ మాదిగ బతుకు’’ గద్దర్ పాట. పాట వెంట పాట. వందలు, వేలు. పాటల ప్రవాహం. తనకు గోసి పెట్టిన ప్రజల కోసం, గొంగళి కప్పిన ప్రజల కోసం, ముద్దు పెట్టిన ప్రజల కోసం వీధుల్లో, వాడల్లో, పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ దేశమంతా పాడుకుంటూ వెళ్లి పోయాడు. ప్రజా వాగ్గేయకారుడిగా ప్రజల గొంతును ప్రపంచానికి వినిపించాడు. సమస్య ధరలదైనా, దొరల దైనా, అగ్రరాజ్యాలదైనా, దాడి దళితుల మీదైనా, గిరిజ నుల మీదైనా, మైనార్టీ మీదైనా, స్త్రీల మీదైనా, దౌర్జన్యం పోలీసుమీదైనా, నక్సలైట్ మీదైనా–ఒక్క మాటలో అన్యా యం ఎక్కడ జరిగితే అక్కడ గద్దర్ ఉంటాడు. వర్గ పోరులో, దళిత ఆత్మగౌరవ ఉద్యమంలో, ఉరిశిక్ష రద్దు పోరాటంలో, దళిత బహుజన రాజకీయ పోరాటంలో గద్దర్ ఆయన లేని ఉద్యమం లేదు. ఆయన లేని పాట, ఆయన పాత్రలేని ప్రత్యేక తెలంగాణ ఉద్య మాన్ని ఊహించలేము. రాజ్యాంగం అమలు లోకి వచ్చి 67 ఏండ్లు నిండినా ఈ దేశంలో ఇంకా దళితులు, గిరిజనులు, బీసీలు, మహి ళలు, మైనార్టీలు ఓటుకు బయటనే ఉన్నారు. చదువు కోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, రేషన్ కార్డు పొందా లన్నా, కూడు తినాలన్నా, దవాఖానాకు పోవాలన్నా, దేవుడ్ని కొలవాలన్నా, చివరికి బిడ్డల పెళ్లిళ్లు చేయాలన్నా అగ్రకులాల దయా దాక్షిణ్యాలతోనే జరగాలి. ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. ప్రజల మనస్సుకు శాంతి లేదు. ప్రజల ఆత్మకు విశ్రాంతి లేదు. సాగు చేసుకోటానికి భూమి లేదు. చావు చేసుకోవటానికి భూమి లేదు. ఏది అడిగినా ఈ పెత్తందార్లు మన అవసరాలని వరాలుగా ప్రకటించి, మన డిమాండ్లనే వాళ్ల రాజకీయ మేనిఫెస్టోగా చెప్పి మన నోరు మూసు కోమంటున్నారు. ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. దళిత, గిరిజన, బీసీ, మహిళ, మైనార్టీ ప్రజల ప్రతినిధు లుగా ఎదిగినవాళ్లకు పదవులతో, కాంట్రాక్టులతో మభ్యపెడుతున్నారు. ఈ దుస్థితికి అనేక కారణాలు న్నాయి. ఓట్ల యుద్ధంలో గెలవాల్సిన వాడు ఓడిపోతున్నాడు. ఓడిపోవా ల్సిన వాడు గెలుస్తున్నాడు. పోరాడేది ఒకడు–పీఠమెక్కేది మరొకడు. మెజా ర్టీగా ఉన్న దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలు 70 ఏండ్లుగా ఓడి పోతూనే ఉన్నారు. ఈ చరిత్ర గతిని మార్చటానికి మెజార్టీ ప్రజలు సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తి తమ జీవితాల్లో వెలుగొందాలని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రజాస్వామిక చైతన్యం. ‘‘ఈ దేశం ఎవడిదిరా – ఈ దేశం మనదేరా/ దుక్కిని దున్నిన రైతుది – మొక్కలు నాటిన కూలిది/ రెక్కలు దప్ప ఆస్తులు లేని – కార్మికులది, కార్మికులది’’ ఇది గద్దర్ ప్రశ్న మాత్రమే కాదు. గద్దర్ సమాధానం కూడా. ‘‘నీ చైతన్యం నీ ఓటును నిర్దేశించాలి. నీ ఓటు నీ జాతి పురోగతికి, ఈ దేశ ప్రగతికి మార్గమవ్వాలి. నీ ఓటుతోనే నిజమైన ప్రజా స్వామ్యం నిలబడాలి’’ ఈ సందేశాన్ని ఇప్పటివరకు ఓటుకు బయట ఉన్న మెజారిటీ దేశ ప్రజలకు అందిం చాల్సిన అవసరం ఉన్నదని శబ్దం భావిస్తుంది. భారత రాజ్యాంగ రక్షణకై ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు శబ్దం కవులను, కళాకారులను, రచయితలను, మేధావు లను, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా ‘‘పల్లె పల్లెకు పాట – పార్లమెంటుకు బాట’’ అనే కార్యక్రమంతో రాజకీయ–సాంస్కృతిక ప్రస్థానాన్ని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నాము. (ఈ పత్రం 6 ఏప్రిల్, 2017న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో జరుగుతున్న శబ్దం కార్యక్రమంలో ప్రజల ఆమోదానికి ప్రవేశపెడుతున్న ప్రతిపాదన) సీఎల్ యాదగిరి, లెల్లె సురేష్ (‘శబ్దం’ ప్రతినిధులు) -
డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : డిగ్రీలో ఇప్పటి వరకు సీటు రాని వారికి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఆప్షన్ల ఎంపికకు గురువారం చివరి గడువని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు సీటు వచ్చిన వారికి అవకాశం లేదని పేర్కొన్నారు. -
రాజకీయ కారణాలతోనే నాపై కాల్పులు
-
కాల్పుల కేసులో డాకూరి బాబుకు రిమాండ్
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి పరిధిలోని పాతబోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులు జరిపిన ఘటనలో అరెస్టు అయిన డాకూరి బాబు అలియాస్ డక్కల బాబు(29) కర్నే ఉమేష్ అలియాస్ సుమన్ (20)లను టాస్క్‌పోర్స్, బోయిన్పల్లి పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం హస్మత్‌పేటలోని సర్వే నం1లో భూతగదా విషయమై శివరాజ్ యాదవ్ అనే వ్యక్తిని హత్య చేస్తే పెద్దమొత్తంలో నగదుతో పాటు 100 గజాల స్థలం ఇచ్చేందుకు 2009లో యాదగిరి, మక్కల నర్సింహ్మ, కనకరాజులు నిందితుడు బాబుకు హామిచ్చారు. కాని హత్య అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో పాటు బాబును అడ్డుపెట్టుకుని పలు భూవివాదాల్లో వీరు తలదూర్చి అక్రమంగా డబ్బులు సంపాదించారని నిందితుడు విచారణలో వెల్లడించాడని ఎస్సై తెలిపారు. దీంతో కక్షతో ఈ నెల 13న నిందితుడు బాబు మరోక వ్యక్తి కర్నే ఉమేష్, అలియాస్ సుమన్(20)తో కలసి పల్సర్‌బైక్‌పై వచ్చి దండుగల యాదగిరి హోండా యాక్టీవాపై వస్తుండగా శ్రీనివాస మెటర్నిటి నర్సింగ్‌హోమ్ వద్ద 3 రౌండ్లు కాల్పులు జరిపాడని ఈ ఘటనలో యాదగిరి గాయలతో పీఎస్‌కు చేరుకోగా ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. కాల్పులు జరిగిన రోజు రెండు కంట్రీమేడ్ వెపన్ తపంచాలు, బుల్లేట్లు, 2 సెల్ఫోన్లు స్వాధినం చేసుకున్నామని చెప్పారు. పలు కేసుల్లో నిందితుడు... 2009 నుంచి 2013 వరకు డాకూరి బాబు నగరంలోని అల్వాల్ పీఎస్ గోపాలపురం ఉఫ్పల్, రాంగోపాల్‌పేట, చైతన్యపురి, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లతో పాటు ఘట్కేసర్, భువనగిరి రూరల్స, భధ్రాచలం పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని ఎస్సై తెలిపారు. అల్వాల్, భువనగిరిలో 2 హత్యకేసులు, మిగిలిన పోలీస్స్టేషన్ల పరిధిలో దోపీడి, దొంగతనాలు, అయుధ చట్టం క్రింద కేసులు ఉన్నాయని వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి, బేగంపేట ఏసీపీ రంగరావు, సీఐ కిరణ్ నేతృత్వంలో కేసును దర్యాప్తు చేసినట్లు తెలిపారు. -
కాల్పుల కేసులో కిల్లర్ బాబు అరెస్ట్
-
కాల్పుల కేసులో కిల్లర్ బాబు అరెస్ట్
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై కాల్పుల కేసులో హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్ డక్కల బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా తాను లొంగిపోతానంటూ మీడియాకు ఫోన్లు చేస్తున్న బాబు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపాయాడు. మూడ్రోజుల క్రితం కాంగ్రెస్ నేత యాదగిరిపై బాబు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలు కిల్లర్ బాబుకు ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సుపారీ కిల్లర్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ( చదవండి: 'కిల్లర్ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది') -
'కిల్లర్ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది'
హైదరాబాద్: హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్ డక్కల బాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కాల్పుల కేసులో డాకూరి బాబును పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. సినీఫక్కీలో యాదిగిరిపై బాబు జరిపిన కాల్పుల వేట ఈ నెల 13న బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాల్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాదగిరికి బుల్లెట్ తగలడంతో ఆ గాయాలతోనే ఆస్పత్రికి వెళ్లి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే యాదగిరిని విచారించేందుకు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
బాత్ రూమ్ పైనుంచి తలకు గన్ పెట్టి..
-
బోయిన్పల్లి కాల్పులలో పోలీసుల విచారణ
-
పేలిన 'రియల్' బుల్లెట్
-
పేలిన 'రియల్' బుల్లెట్
బోయిన్‌పల్లిలో సినీఫక్కీలో కాల్పులు ► ‘అన్నా..’ అని పిలిచి కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులకు దిగిన దుండగుడు ► ప్రాణభయంతో పక్కనున్న ఆసుపత్రిలోకి పరుగు ► అయినా వదలకుండా వెంటాడిన దుండగుడు ► టాయిలెట్ గదిలో దాక్కున్నా అక్కడికి వెళ్లి కాల్పులు ► గోడ దూకి బయటకు పరుగులుపెట్టిన యాదగిరి ► తుపాకీ లాక్కొని కిందపడిపోవడంతో పారిపోయిన దుండగుడు.. ► అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు ► భూవివాదాలే కారణం కావొచ్చు: పోలీసులు హైదరాబాద్: వెనుక నుంచి వచ్చాడు.. ‘అన్నా..’ అని పిలిచాడు.. వెనక్కి తిరగ్గానే ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.. ఛాతీలోకి బుల్లెట్ దిగింది.. బాధితుడు రక్తమోడుతూనే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు.. అయినా దుండగుడు వదల్లేదు.. వెనుక నుంచే తుపాకీతో వెంటాడాడు.. పక్కనే ఉన్న ఆసుపత్రిలోకి పరుగెత్తి డాక్టర్ రూంలోకి వెళ్తే అక్కడకూ వచ్చి తుపాకీ పేల్చాడు.. అక్కడ్నుంచి తప్పించుకొని టాయిలెట్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నా వదల్లేదు.. అక్కడికి వచ్చి డోర్ పగులగొట్టే యత్నం చేశాడు.. ఎలాగోలా తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి దుండగుడి చేతిలోని తుపాకీ లాక్కొని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయాడు.. చనిపోయాడనుకొన్న దుండగుడు అక్కడ్నుంచి జారుకున్నాడు!! సినీఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వేట శనివారం బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం అల్వాల్ పరిధిలో కాల్పుల ఘటన మరచిపోకముందే బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై జరిగిన ఈ కాల్పుల ఉదంతం కలకలం సృష్టించింది. సుపారీ కిల్లర్ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. వెనకాలే వచ్చి.. అన్నా అని పిలిచి.. బోయిన్పల్లి పరిధిలోని మల్లికార్జుననగర్ భాగ్యశ్రీ ఎన్‌క్లేవ్‌లో నివసించే కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరికి కొందరితో సివిల్ వివాదాలున్నాయి. శనివారం ఉదయం 10.35 గంటలకు ఆయన తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఇంటికి సమీపంలోని శ్రీనివాస మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ‘అన్నా’ అని పిలిచాడు. యాదగిరి వెనక్కు తిరిగి చూడగా.. దుండగుడు తన వద్ద ఉన్న తపంచాతో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ఓ తూటా యాదగిరి ఛాతి కింద భాగంలోకి దూసుకుపోయింది. దుండగుడు వరుసగా మూడు రౌండ్లు కాల్చగా ఒకటి మాత్రమే యాదగిరికి తగిలింది. వెంటనే ఆయన ప్రాణభయంతో షటర్ ద్వారా ఆస్పత్రిలోకి పరుగులు తీశాడు. నేరుగా వైద్యుడి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. దుండగుడు రహదారి వైపు వైద్యుడి గది కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరోసారి కాల్చేందుకు యత్నించాడు. దీంతో యాదగిరి ఆ గదిలోంచి ఆస్పత్రి లోపలికి పరుగులు పెట్టాడు. ఓ టాయిలెట్లో దూరి గడియ పెట్టుకున్నాడు. ఆస్పత్రిలోకి ప్రవేశించిన దండగుడు మరో రౌండ్ కాల్పులు జరుపుతూ టాయ్‌లెట్ వద్దకు వెళ్లాడు. దాని తలుపు పగులకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో యాదగిరి టాయ్‌లెట్ గోడ పై భాగంలో ఉన్న అద్దాలను ధ్వంసం చేసి, కమోడ్ ఎక్కి పక్కనే పాథలాజికల్ ల్యాబ్‌లోకి దూకాడు. అక్కడ్నుంచి ఆస్పత్రి వెనుక డోర్ ద్వారా బయటకొచ్చి ప్రహరీ గోడ దూకేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో అక్కడే ఉన్న గేటు ద్వారా బయటకొచ్చి రోడ్డుపై పరుగు తీశాడు. అప్పటికీ వెంటాడుతూ వచ్చిన దుండగుడు మరో రౌండ్ కాల్చాడు. ఈ సమయంలో దుండగుడితో పెనుగులాడిన యాదగిరి అతడి చేతిలోని తుపాకీ లాక్కొని వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. అప్పటికే కాస్త దూరం వెంటాడిన దుండగుడు కింద పడిన యాదగిరి చనిపోయాడని భావించి జారుకున్నాడు. మొత్తమ్మీద ఆరు రౌండ్ల కాల్పులు జరపగా... నాలుగు ఖాళీ తూటాలు ఘటనాస్థలి, ఆస్పత్రి, దాని వెనుక భాగంలో పడి ఉన్నాయి. వైద్యానికి నిరాకరించిన డాక్టర్.. ఛాతీ కింది భాగంగా బుల్లెట్ గాయమైన యాదగిరి కాసేపటికి తేరుకొన్నాడు. దుండగుడు వెళ్లిపోవడంతో లేచి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయాలని వైద్యుడిని కోరాడు. డాక్టర్ నిరాకరించడంతో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బోయిన్పల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. దుండగుడి నుంచి లాక్కున్న నాటు తుపాకీని పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఉదంతంలో ఇద్దరు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకరు సహకరించగా... మరొకరు కాల్పులకు దిగినట్లు చెబుతున్నారు. ఘటనాస్థలికి చుట్టుపక్కల మార్గాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రెండో తుపాకీ ఎక్కడిది? దుండగుడు కాల్పులకు దిగడంతో ఆస్పత్రిలోకి దూరిన యాదగిరి డాక్టర్ రూం వద్ద ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ నాటు తుపాకీ పడేశాడు. ఆస్పత్రి వెనుక పెనుగులాటలో దుండగుడి నుంచి తుపాకీ లాక్కుని, దాన్ని పోలీసుస్టేషన్లో అప్పగించాడు. ఈ నేపథ్యంలో డస్ట్‌బిన్‌లో పడేసిన నాటు తుపాకీ ఎవరిదనే కోణంలో ఆరా తీస్తున్నారు. యాదగిరి దీన్ని తన వద్ద ఉంచుకుని సంచరిస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్పల్లి సమీపంలోని మచ్చ బొల్లారంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు, యాదగిరిపై హత్యాయత్నానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు యాదగిరిపై కాల్పులకు తెగబడింది హస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు డాకూరి బాబుగా తెలుస్తోంది. ఇతడు గతంలో హస్మత్‌పేట చెరువు వద్ద రియల్టర్ శివరాజ్‌ను హత్య చేశాడు. అది సుపారీ హత్య కావడంతో.. ఇది కూడా అదే తరహాకు చెందినదే అని అనుమానిస్తున్నారు. ఇతడు పోలీసు ఎదుట లొంగిపోగా విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. యాదగిరి హత్యకు సుపారీ ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. బాబుకు సహకరించాడని భావిస్తున్న మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని తెలిసింది. -
ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్ట్
వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బైరి రాములుది నల్గొండ జిల్లా ఆలేరు మండలం మందనపల్లి కాగా..శీల యాదగిరిది వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం మాదాపురం. నిందితులను శుక్రవారం ఆర్ ఎన్టీ రోడ్‌లోని బులియన్ మార్కెట్లో అరెస్ట్ చేశారు. వీరు హన్మకొండ, సుబేదారి, కేయూ, ఖాజీపేట, మడికొండ, వర్ధన్నపేట్, ఆత్మకూరు, జనగాం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. -
అప్పు..ఇద్దరి ప్రాణాలు తీసింది
దౌల్తాబాద్: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పు విషయంపై తలెత్తిన వివాదం రెండు కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకుండా చేసింది. ఈ సంఘటన జిల్లాలో దౌల్తాబాద్ దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద యాదగిరి అనే రైతు కొంతమొత్తం అప్పు తీసుకున్నాడు. ఆ రుణం తీర్చలేకపోవటంతో శుక్రవారం ఉదయం కరుణాకర్ రెడ్డి.. యాదగిరికి చెందిన రెండు కాడెడ్లను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదగిరి పొలంలో పురుగు మందు తాగి మృతిపోయాడు. యాదగిరి మృతితో ఆగ్రహించిన అతని కుటుంబీకులు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అందుకు మనస్తాపం చెందిన కరుణాకర్‌రెడ్డి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వల్లపురెడ్డి సాహిత్యం
సమగ్ర సాహిత్యం సామాజిక, ఆర్థిక, మానసిక సంఘర్షణల నేపథ్యంలో, సాంప్రదాయిక సాహిత్య ప్రతిభతోపాటు, ఆధునిక సాహిత్య సాంగత్యంతో అద్భుత శిల్ప నైపుణ్యం గల కథానిక రచన చేసిన రచయిత వల్లపురెడ్డి బుచ్చారెడ్డి. ఈ మధ్యనే ఆయన రచనలన్నీ వల్లపురెడ్డి సాహిత్యంగా రెండు భాగాలుగా వెలువడ్డాయి. కథలు మొదటిభాగం. కవితలు, వ్యాసాలు, పరిష్కరణలు రెండవభాగం. వల్లపురెడ్డి కథలు 1954-1967 మధ్య తెలుగు స్వతంత్ర, స్రవంతి, ఆంధ్రప్రభ వారపత్రిక, శారద, ఉదయభాను, భారతి పత్రికల్లో 52 వరకు ప్రచురించబడ్డాయి. అందులో ఉపలబ్ధమైన 35 కథలతో సంపుటి వెలువడింది. కథలన్నీ మానవతావాద ప్రతీకలే. మనోవైజ్ఞానిక సిద్ధాంత ప్రతిపాదనలే. క్లిష్ట సామాజిక చట్రంలో మనుషుల ప్రవర్తన ఎలావుంటుందో భావశబలతతో చిత్రించారు. శైలి అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. సంప్రదాయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయడం వల్ల అక్కడక్కడ దీర్ఘసమాసాలు, వాడుకలో లేని పదాలు దర్శనమిస్తాయి. అయినా అవి కథాగమనానికి ఏమాత్రం ప్రతిబంధకం కావు. 35 కథలు సన్నివేశాల్లో కానీ, సమస్యల్లో కానీ వేటికవే ప్రత్యేకత కలిగివుంటాయి. ఇక, రెండవసంపుటి ‘మధుగీత’లో మధుగీత, ముక్తగీతికలు, మణికుల్య వ్యాసాలు, నరసయ్య సరస కవిత లాంటివి ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గాలిబ్ ఆదిగా 56 మంది ఉర్దూ కవుల గజళ్లకు, రుబాయిలకు మధుర భావానుకృతులు మధుగీత, ముక్తగీతికలు. వల్లపురెడ్డికున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ భాషల ప్రావీణ్యం ఈ అనువాదాలకు ప్రాణం పోసింది. ‘‘మధుతత్వాన్ని తొనలు ఒలిచి ఇచ్చినంత సుతారంగా ఆవిష్కరించాడు వల్లపురెడ్డి. తన మాటల్లో ఉర్దూ కవితలోని ప్రణయ స్వరూపాన్ని పుడిసిలించి చూపాడు కూడా’’ అన్నారు సినారె. ఈ కవితలతోపాటు, మణికుల్య వ్యాసాలు, నరసయ్య సరస కవిత, శ్రీరంగనాథ విలాసము పరిష్కరణ, ముఖాముఖి, లేఖలు వగైరా కలిగివున్న రెండో సంపుటి వారి భాషా సాహిత్య పాటవాలకు నిదర్శనం. జి.యాదగిరి 9440339917 -
దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
నాచారంలోని శ్రీసాయి వైన్స్ వద్ద జరిగిన దాడిలో గాయపడి చికి త్స పొందుతున్న యాదగిరి(50) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మంగళవారం యాదగిరి మద్యం కోసం వైన్స్‌కు వెళ్ళాడు. అప్పుడే వైన్స్‌కి స్టాక్ రావడంతో వైన్స్‌లో పనిచేస్తున్న శ్యామ్ అనే వ్యక్తి యాదగిరిని కాసేపు ఆగాలని కోరాడు. దానికి నిరాకరించిన యాదగిరి శ్యామ్‌ను దూషించాడు. ఆగ్రహానికి గురైన శ్యామ్ యాదగిరి పై దాడి చే శాడు. తలకు తీవ్రగాయం కావడంతో యాదగిరి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
మద్దూరు : పొలం వద్ద ఉన్న ఎస్ఎస్-3 ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గరై రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల శివారు బంజరలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేచరేణి యాదగిరి (45) తన పొలంలో వరి సాగు చేసాడు. ఈ వారం రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ ఉంటుంది. మంగళవారం సరఫరా నిలిచిపోయి పంపులు నడవకపోవడంతో పక్క రైతులు రాత్రి 2 గంటలకు వచ్చి యూదగిరిని నిద్ర లేపారు. వారితో కలసి పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన యూదగిరి.. ఫ్యూజ్ వైర్ వేస్తుండగా షాక్‌కు గురై పడిపోయూడు. పక్కనున్న రైతులు వెంటనే చేర్యాల ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయకముందే బుధవారం ఉదయం 7 గంటలకు యూదగిరి మృతి చెందాడు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పులి రమేష్ తెలిపారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ: ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన జెల్ల యాదగిరి, వంగ తిరుపతి, భూపతి రాములు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'ప్రేమంటే సై.. పెళ్లికి నై'
బంజారాహిల్స్: ప్రేమిస్తున్నానంటూ.. ప్రియురాలితో కలసి విహరించాడు. తీరా పెళ్లెప్పుడూ అంటే.. పెళ్లి చేసుకోను గాక చేసుకోనన్నాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 56లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివసించే యాదగిరి ఎస్ఐ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇదే బస్తీలో నివసిస్తున్న ఓ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పి ఏడాదిగా చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా.. లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేశారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
తొర్రూరు : నర్సింహులపేట మండలంలోని గుండంరాజుపల్లిలో ఈ నెల 22న జరిగిన నీరటి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తొర్రూరు సీఐ సార్ల రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుండంరాజుపల్లికి చెందిన కుంట రాములు ఆ గ్రామ చెరువు అసలు నీరటికాడిగా పనిచేస్తుండేవాడు. కాగా ప్రస్తుతం రాములుకు బదులు అతడి కుమారుడు యాదగిరి నీరటికాడిగా పనిచేస్తున్నాడు. కాగా ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వచ్చే జీతం డబ్బుల విషయమై కుంట సురేష్, వారి బంధువు చిల్ల ఉప్పలయ్య తరచూ గొడవపడుతుండేవారు. నీరటికాడి వాటా విషయంలో తండ్రీకొడుకులైన రాములు, యాదగిరి తమకు అడ్డుపడుతున్నారని, ఎలాగైన వారిని హతమర్చాలని సురేష్, ఉప్పలయ్య కుట్ర పన్నారు. ఈ నెల 22న రాములు కుమారుడు యాదగిరి(45) చెరువు వద్దకు వెళ్లగా సురేష్, ఉప్పలయ్య కూడా వెళ్లి గొడ్డలితో అతడి మెడపై నరికారు. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో యాదగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో శనివారం ఉదయం దంతాలపల్లిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా సురేష్, ఉప్పులయ్య అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిద్దరిని అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట నర్సింహులపేట ఎస్సై అరాఫత్ ఉన్నారు. -
అమ్మ.. నేను చనిపోతున్నా
ఈ సంఘటన మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మేకల పద్మ, మల్లేశం దంపతులకు మమత(19), స్వప్న, వేణు ముగ్గురు సంతానం. 9 ఏళ్ల క్రితమే తండ్రి మరణించడంతో కూలినాలి చేసుకుంటూ పద్మ తన పిల్లలను పోషించుకుంటోంది. పెద్ద కూతురు మమతను పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ వరకు చదివించింది. అనంతరం గత మే 13న జోగిపేటకు చెందిన అల్మాయిపేట కిషన్, ఇందిర దంపతుల కొడుకు యాదగిరికి ఇచ్చి పెళ్లి జరిపించింది. కట్నకానుకల కింద రూ.4 లక్షల విలువ గల బంగారం, ఇంటి సామగ్రి ఇచ్చి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. పెళ్లై ఆరుమాసాలు కావస్తున్న ఏనాడు తనతో కలిసి లేడని బాధితురాలు మమత తన తల్లికి రాసిన ఉత్తరంలో పేర్కొంది. తన పెళ్లికి వరకట్నంగా ఇచ్చిన రూ.4 లక్షలను తిరిగి తల్లికి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరుతూ ఉత్తరంలో పేర్కొంది. నేను బతికుండి అమ్మకు ఇబ్బంది పెట్టడం కన్నా చావే మార్గమని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. నా చావుకు భర్త, అత్తతో పాటు మా చిన్నత్త కూడా కారణమంటూ రాసిన ఉత్తరాన్ని బీరువాలో దాచిపెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలార్పి హుటాహుటిన ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీరువాలో దాచిన ఉత్తరం గురించి వైద్యులు, కుటుంబీకులకు తెలిపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మమతను గాంధీకి తరలించారు. ఆమె ఒంటిపై 85 శాతం మేర కాలిన గాయాలున్నాయని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దూరదర్శన్ టి.చానల్ ‘యాదగిరి’
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు ‘యాదగిరి’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ ‘సప్తగిరి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ప్రసార భారతి’ సంస్థ ప్రారంభించనుంది. ఈ చానల్‌కు ‘యాదగిరి’ అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దూరదర్శన్ అధికారులను కోరారు. ప్రసారాలను ఈనెల 27 నుంచి ప్రారంభిస్తామని హైదరాబాద్ దూరదర్శన్ అధికారులు తెలిపారు. -
'గాలి' కేసులో యాదగిరికి సుప్రీం బెయిల్!
న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారనే కేసులో రౌడీషీటర్ యాదగిరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యాదగిరి కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఆరు వారాల్లోగా న్యాయమూర్తిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును ఏడాదిలోగా కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆరువారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. -
టీడీపీ 41.. వైసీపీ 15.. వాయిదా 1
గుంటూరు, సాక్షి: జిల్లాలో 57 మండలాలకు సంబంధించి ఎంపీపీ, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 57 మండల పరిషత్ స్థానాలు ఉండగా, అందులో టీడీపీ 41 స్థానాలు, వైఎస్సార్ సీపీ 15 స్థానాలు కైవసం చేసుకున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గ ముప్పాళ్ళ మండల పరిషత్ ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలో చిలకలూరిపేట, గుంటూరు రూరల్ మండలాల్లో టీడీపీ నాయకుల ప్రలోభాలు, దౌర్జన్యాల కారణంగా మెజార్టీ పరంగా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఉన్నప్పటికీ ఒక్కో సభ్యుడు చొప్పున టీడీపీ వైపునకు వెళ్లారు. ఇక్కడ సరి సమానంగా ఎంపీటీసీలు ఉండటంతో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అందులో గుంటూరు రూరల్ మండలం ఎంపీపీ స్థానం టీడీపీకి, ఉపాధ్యక్ష స్థానం వైఎస్సార్ సీపీకి దక్కాయి. అదేవిధంగా చిలకలూరిపేట మండలం మురికిపూడి ఎంపీటీసీని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్నికకు వచ్చే సమయంలో టీడీపీ సభ్యుల వెంట వచ్చిన శ్రీనివాసరావు లోపల వైఎస్సార్సీపీ వైపు చెయ్యి ఎత్తడంతో ఇరువురికి సమాన బలం ఉండటంతో ఎన్నికను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించారు. లాటరీలో ఎంపీపీ స్థానం టీడీపీ అభ్యర్థిని వరించింది. ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడింది. వినుకొండలో వింత పరిస్థితి.. వినుకొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నా ఎంపీపీ పదవికి రిజర్వ్ అయిన ఎస్సీ మహిళా అభ్యర్థులెవ్వరూ విజయం సాధించకపోవడంతో ఇక్కడి ఎంపీపీ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గెలిచిన నడిగడ్డ ఎంపీటీసీ యాదగిరి రామయ్య ప్లేటు ఫిరాయించి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్సన్ పదవుల్ని గుంపగుత్తగా సాధించిన టీడీపీ వినుకొండ మండల పరిషత్‌లో పాగా వేసింది. -
యాదగిరికి కాంగ్రెస్ ఆఫర్
కావలి నుంచి పోటీచేయాలని ఒత్తిడి ఈ గొడవ తమకొద్దని తిరస్కరించిన యాదగిరి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణంలో ఆర్యవైశ్య ఓటర్ల మీద గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అమర యాదగిరి గుప్తను పోటీకి దించాలనే ప్రయత్నం చేసింది. ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గంధి యానాదిశెట్టి లాంటి వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి పట్టణంలో వైశ్య సామాజికవర్గం ఓట్లు పెద్దసంఖ్యలో ఉండటంతో ఆ సామాజికవర్గానికే చెందిన యాదగిరి గుప్తను పోటీ చేయిస్తే వైఎస్సార్సీపీ ఓట్లను నిలువరించవచ్చనే అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా యాదగిరికి ఫోన్ చేసి పోటీకి సిద్ధం కావాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమని, తమ కుటుంబానికి కూడా అలాంటి ఆలోచన లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. యాదగిరి కాదనడంతో కాంగ్రెస్ పార్టీ మరో వ్యక్తి కోసం అన్వేషణలో పడినట్లు తెలిసింది. -
వీరయోధునికి ఘన నివాళి
యాదగిరి, న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఈనెల 8న జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ మున్నాను మట్టి కరిపించి.. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో ఎస్ఐ మల్లికార్జున బండెతో పాటు ఇద్దరు ఏఎస్ఐలు తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. తలలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోవడంతో కోమాలోకి వెళ్లిన మల్లికార్జున బండెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రార్థనలు చేశారు. అయితే మంగళవారం రాత్రి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బుధవారం గుల్బర్గాలో అప్రకటిత బంద్ వాతావరణం ఏర్పడింది. యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి.. బండె మృతికి సంతాపం సూచించారు. హైదరాబాద్-కర్ణాటకలో బీదర్ నుంచి మొదలుకుని గుల్బర్గా, యాదగిరి, రాయచూరుతో పాటు అన్ని చోట్ల పలువురు ప్రముఖులు, సంఘ సంస్థల నుంచి బండె వీర మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గుల్బర్గా నగరంతో పాటు ఆళంద, జేవర్గి పట్టణాల్లో బుధ, గురువారాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ గుల్బర్గా ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బండెకు సకాలంలో వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అభిమానులు, కన్నడ సంఘాల కార్యకర్తలు బుధవారం గుల్బర్గాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. నగరంలోని శాస్త్రి సర్కిల్లో గుమికూడిన అభిమానులు గుల్బర్గా ఎస్పీ అమిత్‌సింగ్‌ను ఘెరావ్ చేసి మల్లికార్జున బండె భౌతికకాయాన్ని సత్వరం తెప్పించాలని డిమాండ్ చేశారు. -
‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంల ఏర్పాటుతో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బడి మానేసిన వారి ని చేర్పించి విద్యతోపాటు వృత్తివిద్యపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2009 జూన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలో ఎనిమిది విద్యార్థులు చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011-12లో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఉండగా.. 2012-13 నాటికి 20కి తగ్గింది. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాలయాన్ని రూ.38.75లక్షలతో, అదనపు గదుల నిర్మాణాన్ని రూ.31.08లక్షలు, ఎఫ్ఎఫ్ నిధులు రూ.30లక్షలతో చేపట్టారు. విద్యార్థులకు కుట్టుశిక్షణ, అల్లికలు, ఎంబ్రయిడరీ, ఆటపాటలపై శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల దుస్తులు, జామెట్రిక్ బాక్స్, బ్లాంకెట్, కార్పెట్, పళ్లెం, గ్లాసు, ప్రతి నెలా తరగతి ఆధారంగా రూ.55 నుంచి రూ.75వరకు కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తున్నారు. బడిమానేసిన వారిని పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. -
వరద నీటిలో యువకుడి గల్లంతు
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రమాదవశాత్తు కాలుజారి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన శనివారం మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన వర్కాల యాదగిరి, లక్ష్మిల కుమారుడు నవీన్ పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం కూడా పేపర్ వేసి ఇంటికి వచ్చాడు. బ్రెష్ వేసుకొని తాళ్లగడ్డ, యాద్గార్పల్లి కల్వర్టు వద్దకు బహిర్భుమికి వెళ్లాడు. యాద్గార్పల్లి చెరువు కట్టవెంట వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు పైనుంచి వెళ్తున్న వరద ఉధృతిని చూసేందుకు నవీన్ కల్వర్ట్ పక్కన నిలబడి చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వాగునీటిలో పడి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న లలితమ్మ అనే మహిళ చూసి కేకలు వేసి నా ఫలితం లేకుండా పోయింది. యాద్గార్‌పల్లిలో యువకుడు గల్లంతు అయిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ డి. శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దారు వేముల రమాదేవిలు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగితెలుసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టినా.. తాళ్లగడ్డ-యాద్గార్పల్లి మధ్యలో గల కల్వర్టులో పడి నవీన్ గల్లంతైన విషయాన్ని తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరదనీటిలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చేతికి వచ్చిన కొడుకు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించించాయి. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : జూలకంటి విషయం తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి డబ్బీకార్ మల్లేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ దుర్గాప్రసాద్, బంటు వెంకటేశ్వర్లు ఆ ప్రాంతాన్ని సందర్శిం చారు. అనంతరం సంఘటనకు గల కారణాలను నవీన్ తల్లిదండ్రులను అడి గి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్సిగ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.