yadma kista reddy
-
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత
సాక్షి, కల్వకుర్తి: మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (75) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కరెంట్ కిష్టారెడ్డి గా పేరున్న ఈయన వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎంపీపీ పదవులతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. అది జనతా పార్టీలో విలీనం కావడంతో అందులో చేరారు. 1973, 1981లో కల్వకుర్తి సర్పంచ్‌గా, 1987లో మండలాధ్యక్షుడిగా, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. (చదవండి: అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి..) కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కలసి పనిచేసినా రాజకీయంగా విభేదించి టీడీపీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అనంతరం 2018లో టీఆర్ఎస్లో చేరారు. ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు కల్వకుర్తిలోని ఆయన వ్యవసాయ పొలంలో మంగళవారం పూర్తయ్యాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కాసేపు పాడె మోశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. సామాజిక స్పృహ కలిగిన నాయకుడు: సీఎం కేసీఆర్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా ప్రజల అభిమానం సంపాదించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు రూపం: ఏపీ సీఎం జగన్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు రూపం ఎడ్మ కిష్టారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు న్నట్లు పేర్కొన్నారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ నేతల సంతాపం ఎడ్మ కిష్టారెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి సంతాపం తెలిపారు. రైతులకు ఎప్పుడూ కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు అంటూ కరెంటు కిష్టారెడ్డిగా గుర్తింపు పొందారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
సాక్షి, కల్వకుర్తి/కల్వకుర్తి: రైతుల ప్రధాన సమస్యల్లో ఒకటైన కరెంట్ ఇక్కట్లు తీర్చాలని ఎన్నో పోరాటాలు చేసి.. చివరికి సమస్య పరిష్కారానికి కృషిచేసి కరెంట్ కిష్టారెడ్డిగా పేరు గడించిన ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పారీ్టలో కొనసాగుతున్నారు. అభివృద్ధిలో చెరగని ముద్ర కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతోపాటు.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి. 1994 నుంచి 2004 వరకు విద్యుత్ కోసం ఆమరణ దీక్ష చేసి రైతుల పక్షాన పోరాటం చేసిన నాయకుడు ఆయన. విద్యుత్ సరఫరా సరిగా లేక బోరు మోటార్లు కాలిపోయి.. చేతికొచ్చే పంటలు ఎండిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకునే రోజుల్లో వారి బాధలు చూసి చలించిన ఆయన 9రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎట్టకేలకు విద్యుత్ సమస్యను తీర్చి కరెంట్ కిష్టన్నగా పేరు గడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనకు ఉద్యమాలు ఎన్నో చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించాక నియోజకవర్గంలో 18.. 33/11కేవి సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించి విద్యుత్ కష్టాలు తీర్చాడు. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కిష్టారెడ్డి ప్రీతిపాత్రు నిగా ఉన్నాడు. సబ్సిడీ కందిపప్పు పథకాన్ని కల్వకుర్తిలోనే ప్రారంభించారు. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కృషిచేశారు. అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, ప్రస్తుత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ తదతరులతో సత్సంబంధాలు నెలకొల్పారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరనిలోటని పలువురు పేర్కొంటున్నారు. ఎడ్మ ఆశయ సాధనకు కృషి : మంత్రి జీవితాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం పాటుపడిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలో ఎడ్మ కిష్టారెడ్డి పారి్థవదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచి మాజీ ఎమ్మెల్యే భార్య పుష్పమ్మ, కుమారుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఆయన మృతికి సంతాపం తెలిపారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఎడ్మ కిష్టారెడ్డిదని కొనియాడారు. నివాళులరి్పంచిన వారిలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జానారెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అభిమానులు హాజరయ్యారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన పారి్థవదేహాన్ని ఇంటి నుంచి దేవరకొండ రోడ్డులో ఉన్న వారి వ్యవసాయం పొలం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కిష్టారెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ వెంట కదిలారు. పెద్ద ఎత్తున జనం అంతిమయాత్రకు తరలివచ్చారు. ఆయన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎడ్మ కిష్టారెడ్డి మృతికి మంత్రి సంతాపం
సాక్షి, మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్మ కిష్టారెడ్డి మృతికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిబద్ధత, నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎడ్మా కిష్టా రెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. రెండుసార్లు కల్వకుర్తి నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఎడ్మ కిష్ఠా రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఏ రాజకీయ పక్షంలో ఉన్నా ప్రజాపక్షమే తన తుది ప్రస్థానం అని ఎన్నో సార్లు చెప్పారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కార్మికులు వలసలు పోకుండా ఉండటానికి అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఎడ్మ కిష్టారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఎర్రబెల్లి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
'రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ'
మహబూబ్‌నగర్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 5 రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని చెప్పారు. పరామర్శ యాత్ర పోస్టర్ ను మహబూబ్‌నగర్ లో సోమవారం కిష్టారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 921 కిలోమీటర్ల మేర షర్మిల యాత్ర చేయనున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. కల్వకుర్తి నుంచి పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది.