Yellow cultivation
-
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘పసుపు సాగు.. ఎగుమతులు’అనే అంశంపై సోమవారం వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రబ్బర్, సిల్క్‌కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపుకూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో లేదో కేంద్రం అధ్యయనం చేయాలని కోరారు. మేలైన రకాల పసుపు విత్తనాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. అయితే బోర్డు ఏర్పాటు కుదరదని, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారన్నారు. ఆ విధంగానే పసుపు సెల్ ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. 1990లో 7 లక్షల మెట్రి క్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు శాతమే పసుపు ఎగుమతి జరుగుతోందన్నారు. గతంలో ఎంపీలు పట్టించుకోలేదు: జీవన్‌రెడ్డి గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కవిత ఎంపీ అయ్యాక పసుపు రైతుల గురించి అనేకసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారన్నారు. ప్రత్యేక పసుపు సెల్ ఏర్పాటుకు ఎంపీ కవితనే కారణమన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ఎంపీ కవిత కృషి వల్ల పసుపుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డు కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని గుర్తు చేశారు. కాగా, ఈ వర్క్ షాప్‌లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్ వ్యూహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్ డైరెక్టర్ పీఎం.సురేశ్‌కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ఏబీ రేమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి రైతుల డిమాండ్లు.. - పసుపు కుర్కుమిన్ నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలి. - ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి. - పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలి. -
పసుపు తవ్వే పరికరం ఇదిగో..!
తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం. బెడ్ పద్ధతికి అనువుగా నూతన పరికరం.. ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు. పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు. రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం.. పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం. – ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను.. ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను. – నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, సాక్షి -
పసుపు సాగుతో పసిడి పండించా..
సాక్షి, అమరావతి: ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ గోళ్ల వెంకట రఘు విషయంలో రోజుకొక ఆసక్తికరమైన విషయం వెల్లడవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ రఘు, ఆయన బినామీల ఇళ్లపై ఇటీవలే మెరుపుదాడులు నిర్వహించిన ఏసీబీ బృందాలు పలుకీలక పత్రాలు, ఆధారాలు సేకరించిన సంగతి తెల్సిందే. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చడానికి ముందే రఘును విచారించిన ఏసీబీ అధికారులు ఆయన చెప్పిన మాటలు విని విస్తుపోయినట్టు తెలిసింది. ప్రభుత్వ అధికారిగా తాను అక్రమార్జనకు పాల్పడలేదని, పసుపు సాగుతో ఆదాయాన్ని ఆర్జించానంటూ రఘు చెప్పినట్టు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే రఘు, ఆయన బినామీలు వద్ద దొరికిన భారీ మొత్తం బంగారం, వెండి, వజ్రాల నగలు, భవంతులు, స్థలాలు వంటి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పసుపు సాగుతోనే సంపాదించారా? అంటూ ఏసీబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆధారాల కోసం ఏసీబీ కసరత్తు.. రఘు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆయన, ఆయన బినామీలు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారనడానికి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టిన రఘు కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు జాయింట్ ఆపరేషన్ కోసం తెలంగాణ ఏసీబీ అధికారులతో ఏపీ ఏసీబీ అధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పనిచేసిన రఘు షిర్డీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
వన్నె తగ్గిన పసుపు
క్వింటాల్‌కు రూ.3వేలు తగ్గిన ధర - గతేడాది రూ. 9 వేల దగ్గరలో.. - ఇప్పుడు రూ. 5 వేల వరకే.. - పెరిగిన కూలి రేట్లు, పెట్టుబడి ఖర్చులు - పెట్టుబడులూ గిట్టవంటున్న రైతులు సాక్షి, మహబూబాబాద్: రైతులకు పసుపు పంట కూడా నిరాశే మిగిల్చింది. కనీసం పెట్టు బడి చేతికి అందివచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. గత ఏడాది క్వింటాల్ పసుపునకు రూ.9 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ధర పలుకుతోంది. సోమవారం జిల్లాలోని కేసముద్రం మార్కెట్ పసుపు కాడిరకం గరిష్టంగా రూ. 5,300, కనిష్టం రూ. 4,217 పలికింది. గోళ రకం గరిష్టంగా రూ. 4,900, కనిష్టంగా రూ. 4,170 పలికింది. రాష్ట్రంలో నిజామామాబాద్ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో పసుపు క్రయ, విక్రయాలు అధికంగా జరుగుతాయి. రాష్ట్రంలోనే సాగు విస్తీర్ణంలో కూడా మహబూబాబాద్ జిల్లా మూడోస్థానంలో నిలుస్తోంది. ఆదాయం మాట ఏమో గానీ పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 9,390 హెక్టార్లలో పసుపును సాగు చేశారు. గతంలో ఎకరా విస్తీర్ణంలో సాగు చేయడానికి రూ.50వేల వరకు ఖర్చు కాగా, పెరిగిన పెట్టు బడులు, కూలీల రేట్లతో ఇప్పుడు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధార ణంగా ఎకరం విస్తీర్ణంలో 20 క్వింటాళ్ల ఎండిన పసుపు దిగుబడి వస్తుంది. ఈ సారి మాత్రం దాదాపు అందరికీ 15 క్వింటాళ్ల దిగుబడే అందుతోంది. దీన్ని మార్కెట్లో విక్రయిస్తే రూ. 90వేలు సైతం రావడం లేదు. పెరిగిన కూలి రేట్లు.... మార్కెట్లో పడిపోయిన ధరకు తోడు కూలి రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మహిళ కూలీకి రూ.100 ఉండగా, ఈ సారి రూ.250కి పెరిగింది. ఎకరం పంటను తీయడానికి 60 మంది కూలీలకు రూ.15,000 వరకు చెల్లిస్తున్నారు. మార్కెట్లో కూలి రేట్లు పెంచాలని నెల రోజులుగా ఇక్కడి కూలీలు సమ్మె చేస్తున్నారు. అయితే, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెల రోజుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైంది. శ్రమ అంతా వృథా అయింది పసుపుకు మార్కెట్లో ధర బాగా వస్తుందని పండించాను. విత్తనాల ఖర్చు కాకుండానే రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చే సరికి క్వింటాల్‌కు రూ. 4,981, గోల రకానికి రూ. 4,500 ధర పలికింది. పెట్టుబడి కూడా రాలేదు. శ్రమ అంతా వృథా అయింది. –బొడ్డుపెల్లి శ్రీను, నెక్కొండ, వరంగల్ రూరల్ జిల్లా ఎకరం పసుపు సాగుకు పెట్టుబడి వివరాలు ► విత్తనం(8 క్వింటాళ్లు) రూ.32,000 ► దుక్కి దున్నేందుకు రూ.3,000 ► సేంద్రియ ఎరువుకు రూ.10,000 ► విత్తనం వేసేందుకు(12మంది కూలీలకు) రూ.3,000 ► విత్తనం వేయడానికి నాగలి కూలికి రూ.800 ► విత్తనం వేసేముందు దుక్కి దున్నేందుకు రూ.1,500 ► కలుపు మందుకు రూ. 300 ► గుంటక దున్నేందుకు(5 సార్లకు) రూ. 3,500 ► మూడు సార్లు కలుపు తీతకు కూలీలకు రూ. 9,000 ► ఎరువులు(యూరియా, పొటాష్) రూ. 5,400 ► పురుగు మందులకు రూ.1,500 ► గుళికలు(దుంపకుళ్లు నివారణకు),ఫంగిసైట్స్ రూ. 3,000 ► పసుపు దున్నడానికి నాగలి కూలి రూ. 6,000 ► భూమి నుంచి పసుపు తీసేందుకు (60 మంది కూలీలకు) రూ.1,5000 ► ఉడకబెట్టడానికి ఆరుగురు కూలీలకు రెండు రోజుల పాటు రూ.7,000 ► ఎండిన పసుపును పాలిష్ చేసేందుకు రూ. 2,000 ► ఎకరం పసుపును పండించడానికి చేతికి అందే సరికి ఇలా మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 1,03,000