YSR district TDP
-
ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిలు మంజూరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పులివెందుల పూల అంగళ్ల కూడలి అల్లర్ల కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరైంది. నేడు సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా 2018 నాటి అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని ఈ నెల 3న చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 4వ తేదీన పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే సోమవారం నాటికి రిమాండ్ గడువు ముగియడంతో బీటెక్ రవికి పులివెందుల కోర్టు బెయిలు మంజూరు చేసింది. (చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్) చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు! -
సీనియర్లకు బాబు మొండిచేయి
అమరావతి : రాజంపేట పార్లమెంటు స్థానంపై గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతలు పసుపులేటి బ్రహ్మయ్య, పాలకొండ రాయుడికి చంద్రబాబు మొండిచేయి చూయించారు. రాజంపేట సీటు కోసం ప్రయత్నిస్తూ ఇటీవలే పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురైన సంగతి తెల్సిందే. రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజంపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డే(రాజంపేట శాసనసభ స్థానం నుంచి). ఇటీవలే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెల్సిందే. అలాగే రాయచోటిలో పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న సీనియర్ నేత పాలకొండ రాయుడిని పక్కన పెట్టి ఈ సారి రమేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. పీలేరు శాసనసభా స్థానం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనూష రెడ్డి, రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్‌లకు సీట్లు కేటాయిస్తున్న చంద్రబాబు వెల్లడించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లాలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవలే సీనియర్లు తమకు టిక్కెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంటుగానైనా బరిలోకి దిగుతామని బాహాటంగా హెచ్చరించిన సంగతి తెల్సిందే. -
టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు
వైఎస్సార్ : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. టీడీపీలోని కాపు నాయకులు, మాజీ మంత్రి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమై అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరుపై మండిపడ్డారు. జిల్లా టీడీపీలో ఒక కులానికి చెందిన నాయకులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాలను నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఏ రోజూ పార్టీకి పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం బాధాకరమన్నారు. సొంత పనులు చేసుకునేందుకు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. టీడీపీలో బలిజలకు ఒక న్యాయం..రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, మాకు ధైర్యం చెప్పే నాయకులే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే మాకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలాంటి సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఒకరి నియోజకవర్గ పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని ఉద్దేశించి నిరసన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. మా లాంటి సీనియర్లు ముఖ్యమంత్రికి కనబడటం లేదా.. మాకు న్యాయం చేయకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. -
సీఎం రమేశ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
-
సీఎం రమేశ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి రాజుకుంది. మొదట్నుంచీ ఆదినారాయణరెడ్డి రాకను టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయనకు మంత్రిపదవి దక్కడాన్ని జమ్మలమడుగులోని టీడీపీ కార్యకర్తలు, రామసుబ్బారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రమేశ్ లాబీయింగ్ వల్లే ఆ యనకు పదవి దక్కిందని వీరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో శుక్రవారం సాయంత్రం రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసిన టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు ఆగ్రహంతో కుర్చీలను సీఎం రమేశ్‌పై విసిరేశారు. ఆయన వైపు దూసుకెళ్లారు. సీఎం రమేశ్ చుట్టూ గన్మెన్లు రక్షణ వలయంగా నిలిచారు. గాలిలో లేచిన కుర్చీలు గన్మెన్లకు తగిలాయి. మాజీమంత్రి పి.శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ ఓవైపు, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కార్యకర్తలను శాంతింపజేశారు. -
'ఫిరాయింపు'పై టీడీపీలో కుమ్ములాట: ఎంపీపై దాడి
జమ్మలమడుగు: ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టిన వ్యవహారంలో టీడీపీలో చెలరేగిన నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం వేదికగా తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీ(రాజ్యసభ) సీఎం రమేశ్‌పైకి కొందరు కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశ ప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తొలి నుంచీ టీడీపీనే నమ్ముకుని పార్టీ ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు పదవులు ఇవ్వకుండా నిన్నమొన్న చేరినవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇంకాస్త రెట్టిస్తూ.. ఆదినారాయణరెడ్డికి.. ఎంపీ సీఎం రమేశ్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని, ఆదికి మంత్రి పదవి దక్కడంలో రమేశ్ ముఖ్యపాత్ర పోషించాడని రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రామసుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. 'సీఎం రమేశ్.. గో బ్యాగ్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆవేశం పట్టలేని కార్యకర్తలు ఒక దశలో సీఎం రమేశ్ వైపునకు కుర్చీలు విసిరేశారు. 'పార్టీని నమ్ముకున్న మాకు తగిన శాస్తి జరిగింది.. పార్టీ ఫిరాయించినవాళ్లకు మంత్రి పదువులు దక్కాయి..'అని రామసుబ్బారెడ్డి వర్గీయులు వాపోయారు. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనేకాక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన అన్ని జిల్లాల్లోనూ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు, మంత్రిపదవులు దక్కినవారి వ్యతిరేకులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే గుంటూరు మండలం లో అంబేడ్కర్ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనందబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు మండలం శాకమూరులో అంబేడ్కర్ స్మృతి వనం భూమి పూజకు ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనంద్ బాబు కాన్వాయ్ ను శ్రవణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటనకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశం’లో ‘ఆది’ చిచ్చు! -
'ఫిరాయింపు'పై టీడీపీలో కుమ్ములాట