Top Stories
ప్రధాన వార్తలు

రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి
తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా . యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. జరిగింది ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. అధికార తెలుగుదేశం పార్టీకి అతడు సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరుని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటన బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి.బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి.లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి.మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి
బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.

అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్‌జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్‌మన్ తన ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధరఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్‌ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్‌మన్ వినియోగదారులను కోరారు.

టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
టాలెంట్ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్ రాజ్‌పుత్'(Payal Rajput) అన్నారు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి దగ్గరైంది. ఈ మూవీ తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, చాలారోజుల గ్యాప్ తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటిగా పాయల్ అవార్డ్ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్ ఒక పోస్ట్ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్ రాజ్‌పూత్ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్ చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025

బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్, ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా కొత్తగా క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు. ఈ ముగ్గురి చేరికతో క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్, కుహ్నేమన్, వెబ్‌స్టర్ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ పొందారు. కొన్‌స్టాస్, వెబ్‌స్టర్ భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. కొన్‌స్టాస్ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కొన్‌స్టాస్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్ అయ్యాడు.వెబ్‌స్టర్ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్ మార్ష్, కెమారూన్ గ్రీన్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పట్టాడు.2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్లెట్
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
కేబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
ఎస్బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
కేబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
ఎస్బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
సినిమా

మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్కే. సెల్వమణి
తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపైమరోకరు చేసుకుంటూనే ఉన్నారు. నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకుంది. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. దీంతో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఈ ప్రకటన వెనుక తమిళ్ నిర్మాతల మండలి ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు. నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందన్నారు.కుట్రలు పాల్పడుతోంది వారే.. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు.

OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు.

శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్‌లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్బుక్లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.'ఎల్ 2: ఎంపురాన్' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం
క్రీడలు

ఐపీఎల్లో నేడు (ఏప్రిల్ 1) విధ్వంసకర వీరుల సమరం.. గెలిచేది ఎవరు..?
ఐపీఎల్-2025లో ఇవాళ (ఏప్రిల్ 1) రెండు విధ్వంసకర జట్ల మధ్య పోటీ జరుగనుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఇరు జట్లలో సమాంతరమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సొంత మైదానంలో ఆడటం ఎల్ఎస్జీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని పంజాబ్‌ను తక్కువ అంచనా వేయలేము. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు చెలరేగితే ఎక్కడైనా, ఏ జట్టుపై అయినా విజయం సాధించగలరు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. గుజరాత్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వద్దనుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం కుర్రాడు ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) కూడా సత్తా చాటారు. మెరుపు వీరులు మ్యాక్స్‌వెల్ (0), స్టోయినిస్ (20) విఫలమైనా ఈ మ్యాచ్‌లో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. లక్ష్యానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-36-2), స్పిన్నర్ విజయ్‌కుమార్ వైశాక్ (3-0-28-0) మాత్రమే పర్వాలేదనిపించారు. కీలక సమయంలో వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి మ్యాచ్‌ను దూరం చేశాడు. నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు మ్యాక్సీ, స్టోయినిస్ కూడా రాణిస్తే పంజాబ్‌ను ఆపడం కష్టమవుతుంది.లక్నో విషయానికొస్తే.. ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలవాల్సింది. అయితే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో లక్నో విధ్వంసకర బ్యాటర్లు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు మెరుపు అర్ద సెంచరీలు చేసి తమ జట్టు భారీ స్కోర్‌కు (209) దోహదపడ్డారు. మరో డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా ఓ మోస్తరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మరో హార్డ్ హిట్టర్ మార్క్రమ్ కూడా సత్తా చాటలేకపోయాడు. మొహిసిన్ ఖాన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎల్ఎస్జీలో చేరిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. దేశీయ బౌలర్లు మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ కూడా రాణించారు. సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్‌లో లక్నో పిచ్చ కొట్టుడు కొట్టి సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత శార్దూల్ ఠాకూర్ (4-0-34-4) బంతితో చెలరేగిపోయాడు. ఆతర్వాత మార్ష్, పూరన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా సన్‌రైజర్స్ సెట్ చేసిన 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీ 16.1 ఓవర్లలోనే ఊదేసింది. పంజాబ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌లో పూరన్, మార్ష్ మరోసారి విజృంభిస్తే లక్నో విజయం ఖాయం. పంజాబ్‌తో పోలిస్తే లక్నోలో భారీ హిట్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. మార్క్రమ్, పంత్, ఆయుశ్ బదోని కూడా టచ్‌లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. గతేడాది సన్‌రైజర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన అబ్దుల్ సమద్ ఈ సీజన్లో లక్నోతో ఉన్నాడు. శార్దూల్ కూడా లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలదు.పంజాబ్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమైపోయింది. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి. చరిత్ర చూస్తే ఇరు జట్ల ఇప్పటివరకు నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. లక్నో 3, పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచాయి. నేటి మ్యాచ్‌లో లక్నోకు అనుకూలంగా ఉండే ఆనవాయితీనే కొనసాగుతుందని చెప్పలేము. పంజాబ్‌లో కూడా మెరుపు వీరుల సంఖ్య తక్కువ లేదు.తుది జట్లు (అంచనా)..లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ రతీ, ప్రిన్స్ యాదవ్పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, లాకీ ఫెర్గూసన్/అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకే.. రసెల్ వికెట్ కీలకం: హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్‌ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్‌ను గమనించాము. అతని బౌలింగ్‌లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్‌ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం.

MI VS KKR: సమిష్టి వైఫల్యం.. రహానే ఆవేదన
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు. రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టాస్‌లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్‌పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్‌ను, పేస్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి. బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్‌లో ఉండటం అవసరం.

IPL 2025: రూ. 23.75 కోట్లు దండగ.. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలట..!
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 31) కేకేఆర్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ విజృంభణకు తోడు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ బ్యాటర్లు అశ్వనీ కుమార్ సహా మిగతా ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నీ కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్ వర్మ (సన్‌రైజర్స్), విప్రాజ్ నిగమ్ (ఢిల్లీ) చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. నీపై పెట్టిన పెట్టుబడి దండగ అని అంటున్నారు. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా రింకూ సింగ్, ఆండ్రీ రసెల్‌ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్‌ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో కాస్ట్లీ ప్లేయర్ అన్న విషయం కూడా తెలిసిందే. మొత్తంగా తొలి 3 మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కోవడంతో కేకేఆర్ అభిమానులు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గు పడుతున్నారు.
బిజినెస్

కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బీఎస్ఈకి చెందిన సెన్సెక్స్ ఏకంగా 1160 పాయింట్లు పడిపోయి 76,261కు చేరింది. ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలోని నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి 23,243 మార్కు వద్ద కదలాడుతుంది. దాంతో ఈరోజు మార్కెట్ సెషన్లో ప్రస్తుత సమయం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. భారీగా మార్కెట్ సూచీల పతనానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు2025 ఏప్రిల్ 2న అమెరికా సుంకాల విధింపు నిర్ణయాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడం వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.అమెరికా భారత్‌ను నేరుగా టార్గెట్ చేయనప్పటికీ, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తుంది.ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా చాలా రంగాల సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగానే క్షీణించాయి.ఇటీవల మార్కెట్లు పడి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పూనుకుంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతుంది. దాంతో దేశీయ దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది.

తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలను మాత్రం మార్చలేదు.ధరల హెచ్చుతగ్గులుగత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపునగరాల వారీగా ధరలుఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)కోల్‌కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది)

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు నష్టపోయి 23,454కు చేరింది. సెన్సెక్స్(Sensex) 303 పాయింట్లు దిగజారి 77,113 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.1 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపుట్రంప్ సుంకాలపై ఏప్రిల్ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు
దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలను భారత్ రెండేళ్లలో తొలిసారిగా పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీఎం(అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం) గ్యాస్ ధరను 10 లక్షల థర్మల్ యూనిట్లకు 6.50 డాలర్ల నుంచి 6.75 డాలర్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును ఏపీఎం గ్యాస్ అంటారు. ఈ గ్యాస్‌ను ‘అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం’ వద్ద వినియోగదారులకు విక్రయిస్తారు.ఇంట్లో వంట అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువుగా ఈ గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఆటోమొబైల్స్ అవసరాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌గా మారుస్తారు. ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా రెండేళ్లలో తొలిసారి ధరల పెంపును అమలు చేశారు. 2023 ఏప్రిల్‌లో దేశీయంగా ఉత్పత్తి అయిన సహజ వాయువు ధరలను మిలియన్ థర్మల్ యూనిట్లకు 4 డాలర్లు నుంచి గరిష్టంగా 6.5 డాలర్లుగా పరిమితిని విధించారు. ధరల పెంపుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదికను గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2027 వరకు 0.5 డాలర్లు పెంచాలని సూచించింది. 2023 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి పెంపు తీసుకోలేదు. ఈ గడువు ముగియడంతో తాజాగా 0.25 డాలర్ల పెంపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు రేట్లు మారవని, ఆ తర్వాత మరో 0.25 డాలర్లు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులుకంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) అనేది అధిక పీడనం వద్ద నిల్వ చేసి ఉపయోగించేందుకు వీలైన గ్యాస్. దీన్ని ప్రధానంగా మీథేన్, గ్యాసోలిన్, డీజిల్ లేదా బొగ్గు వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగాస్తున్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోరిక్షాలు సహా ఆటోమొబైల్స్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా సీఎన్జీని విస్తృతంగా వాడుతున్నారు. గ్యాసోలిన్ లేదా డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది.
ఫ్యామిలీ

పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)

ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!)

మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885

ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్‌వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్‌గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్‌తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్‌పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్‌కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్‌కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్‌గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్‌లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా
ఫొటోలు


ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)


వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)


‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)


టిక్ టాక్ వీడియోలతో ఫేమస్..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి (ఫొటోలు)


గార్దభాలను బండ్లకు కట్టుకుని గుడి చుట్టూ బురదలో ప్రదర్శన (ఫొటోలు)


నంద్యాల : ప్రేమ కోసం పిడకల యుద్ధం..ప్రేమదే విజయం (ఫొటోలు)


'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


గ్రాండ్‌గా మంచు ఫ్యామిలీ ఉగాది వేడుకలు (ఫోటోలు)


ఉగాది లుక్.. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


ఉగాది వేడుక చీరలో అందంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫొటోలు)
International

ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025

భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

Newton Death Anniversary: నేటికీ వెల్లడికాని న్యూటన్ మరణ రహస్యం
సర్ ఐజాక్ న్యూటన్(Sir Isaac Newton).. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకనిగా గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన సూత్రాలు నేటికీ గణితం, విజ్ఞాన శాస్త్రంలో ఉపయుక్తమవుతున్నాయి. ఆయన జీవితం ఎన్నో రహస్యాలతో కూడి ఉందంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనత సాధించిన న్యూటన్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై నేటికీ చర్చలు కొనసాగుతుంటాయి.ఐజాక్ న్యూటన్ 1727, మార్చి 31న బ్రిటన్‌లోని మిడిల్‌సెక్స్‌లోని కెన్సింగ్టన్లో కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి(Death anniversary). ఈ సందర్భంగా పలుచోట్ల ఆయనను గుర్తు చేసుకుంటూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. న్యూటన్ గణిత శాస్త్రవేత్తగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా, రచయితగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. న్యూటన్ కనుగొన్న కలన గణిత సిద్ధాంతం గణిత శాస్త్రానికి కొత్త ఆధారాన్ని అందించింది. అదేవిధంగా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అందించి, శాస్త్రీయ భౌతిక శాస్త్ర సిద్ధాంతానికి పునాది వేశారు.ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసిన ఆయన గ్రహాల కదలికల గురించి వివరించారు. తొలి ఇమేజ్ ఆధారిత టెలిస్కోప్(Telescope)ను తయారు చేశారు. ప్రిజం ద్వారా ఆప్టికల్ రంగులపై అధ్యయనం చేశారు. ధ్వని వేగాన్ని లెక్కించడం, శీతలీకరణ నియమం మొదలైనవి న్యూటన్‌కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయనకు వేదాంతశాస్త్రంలో కూడా ఆసక్తి ఉంది. న్యూటన్ బైబిల్‌ను అధ్యయనం చేశారని చెబుతారున్యూటన్ మరణంలోనూ రెండు వాదనలు వినిపిస్తాయి. న్యూటన్ నిద్రలో మరణించారని, అనంతరం అతని శరీరంలో పాదరసం కనిపించిందని చెబుతారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు రసవాదంతోనూ సంబంధం ఉందని అంటారు. న్యూటన్ తన చివరి రోజులను ఎంతో రహస్యంగా గడిపారు. ఆ సమయంలో ఆయన మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని, సమాజానికి దూరంగా మెలిగారని చెబుతారు. న్యూటన్ తన మరణానికి ముందు తన ఆవిష్కరణలకు సంబంధించిన కొన్ని పత్రాలను తగులబెట్టారని కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి రసవాదానికి సంబంధించినవని భావిస్తారు. న్యూటన్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.ఇది కూడా చదవండి: మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!

రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
National

వక్ఫ్ బిల్లుకు సర్వం సన్నద్ధం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవపట్టించి, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలకు ప్రయోజనాలను అందించేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. అయితే, ముస్లింలను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకువచ్చేందుకు జరిగే ప్రయత్నాలు దేశానికి మంచివి కావని చెప్పారు. బిల్లు చట్టం రూపంలోకి వస్తే మసీదులు, ఖబరస్తాన్‌ల వంటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని గుర్తు చేశారు. బిల్లులోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని మంత్రి ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును తొందరగా ప్రవేశపెట్టాలని తనను కోరాయని మంత్రి వివరించారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింప జేసుకోవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టే తేదీ ఇంకా నిర్ణయం కాలేదని తెలిపారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. దీన్నిబట్టి చూస్తే మంగళవారం వక్ఫ్ బిల్లును మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కని్పస్తున్నాయి. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.

నిద్రపై స్క్రీన్ ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఎక్కువసేపు ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టెలివిజన్ ఇలా ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువసేపు చూస్తే వెంటనే చాలా మందికి నిద్రపట్టదు. చాలా సేపటి తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఈ సమస్య రానురాను శాశ్వతంగా ఉండిపోయి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్సోమ్నియాగా పిలిచే నిద్రలేమి సమస్య బారినపడే అవకాశాలు ఏకంగా 60 శాతం అధికమవుతాయని ఈ కొత్త పరిశోధనలో తేలింది. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ఇటీవల ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకియాట్రీ’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వేల మందిపై పరిశోధన అధ్యయనంలో భాగంగా నార్వేలో 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్న 45,000 మందికిపైగా విద్యార్థుల రోజువారీ జీవనశైలి వివరాలను సేకరించారు. రోజూ ఏ సమయానికి నిద్రపోతారు, రాత్రిళ్లు నిద్రపోవడానికి ముందు ఎంతసేపు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ చూస్తారు, తర్వాత ఎంతసమయానికి నిద్రపడుతుంది, వంటి ఎన్నో వివరాలను రాబట్టారు. డిజిటల్ పరికరాలను వాడేటప్పుడు సినిమాలు చూస్తారా, సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తారా వంటి వివరాలను సేకరించారు. ‘‘సోషల్ మీడియా మాధ్యమాల చూడటం కోసం వెచ్చించి సమయం, ఇతర కార్యక్రమాలను చూడటానికి కేటాయించిన సమయాల్లో పెద్ద తేడాలులేవు. ఏ రకం డివైజ్‌ను వాడారు అన్న దానికంటే అసలు ఎంత సమయం వాడారు అనేదే ఇక్కడ ప్రధానం. స్క్రీన్ ఎక్కువసేపు చూడటం వల్ల అంతసేపు నిద్రను వాయిదావేస్తున్నారు. దాంతోపాటు స్క్రీన్ వాడకం వల్ల తర్వాత సైతం నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారు. ఇలా దాదాపు 30 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిద్రలోకిజారుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిద్రపట్టక మధ్యలో బెడ్ మీద నుంచి లేచి వచ్చి కొద్దిసేపు అటూ ఇటూ నడవడం లాంటివి చేస్తున్నారు’’అని నార్వేనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధకుడు, పరిశోధనలో కీలక సభ్యుడు గన్హీల్డ్ జాన్సన్ హెజెట్ల్యాండ్ చెప్పారు. రోజంతా ఇబ్బంది ‘‘ఇలా రాత్రిళ్లు స్క్రీన్ చూసి నిద్రపట్టక కాస్త ఆలస్యంగా నిద్రపోయిన వారు తెల్లారాక సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నాణ్యమైన నిద్రలేకపోవడంతో తదుపరి రోజంతా దైనందిన జీవిత పనులను సవ్యంగా చేసుకోలేకపోతున్నారు. అధిక స్క్రీన్ వినియోగం అనేది నాలుగు రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. తరచూ నోటిఫికేషన్లు టింగ్ టింగ్‌మని వస్తూ నిద్రను పాడుచేస్తాయి. నిద్రపోయే సమయాన్ని స్క్రీన్టైమ్ అనేది మింగేస్తోంది. స్కీన్చూసినంతసేపు నిద్రపోలేని పరిస్థితి ఉండటంతో ఆమేరకు నిద్ర తగ్గుతోంది. అంతసేపు స్కీన్ నుంచి వచ్చే కాంతి ప్రభావానికి లోనవడంతో శరీరంలోని జీవగడియారం సైతం సరిగా పనిచేయదు’’అని జాన్సన్ వివరించారు.ఎన్నో సమస్యలుస్క్రీన్ టైమ్ కారణంగా నిద్ర మాత్రమే తగ్గి కేవలం ఇన్సోమ్నియా బారిన పడతామని భావించకూడదు. అది రోజువారీ జీవితంపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెల్లగా దెబ్బతింటుంది. విద్యా ప్రమాణాలు పడిపోతాయి. సగటున 24 నిమిషాల నిద్రాకాలం తగ్గిపోతుంది. మొత్తంగా విద్యా, ఆరోగ్యం, మానసిక సంబంధ స్థాయిలు దిగజారుతాయి. ఈ సమస్యలు శాశ్వతంగా ఉండకూడదంటే నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంటముందే స్క్రీన్‌ను చూడటం ఆపేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో హోమ్‌పేజీపై నోటిఫికేషన్లు కనపడకుండా డిజేబుల్ చేయాలి’’అని జాన్సన్ సూచించారు.

వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది. సముద్రజలాల్లో శత్రు దేశాల యుద్ధనౌకలపై ఓ కన్నేసి, నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధునాతన‘వాటర్ డ్రోన్’ను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. అన్ని దశల పరీక్షలను పూర్తిచేసుకున్నాక ఇది భారత నౌకాదళాల చేతికి రానుంది. దీంతో సముద్రజలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరన్స్ అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (హెచ్ఈ ఏయూవీ)ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యం ‘ఎక్స్’లోని తన ఖాతాలో ఒక ప్రకటన విడుదలచేసింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్ డ్రోన్‌గా పిలుస్తారు. సరస్సులో వాటర్ డ్రోన్‌ను పరీక్షిస్తున్న వీడియోను డీఆర్డీఓ తన ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్చేసింది. ఉపరితలంలో, కాస్తంత మునిగి ప్రయాణిస్తూ ఈ అటానమస్ వెహికల్ నిర్దేశిత పరామితులను అందుకుందని సంస్థ పేర్కొంది. సోనార్, కమ్యూనికేషన్ సామర్థ్యాలను అత్యంత కచ్చితత్వంతో ప్రదర్శించిందని ప్రకటించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లేబొరేటరీ ఈ వాటర్ డ్రోన్‌ను అభివృద్ధిచేసింది. దాదాపు 6 టన్నులు బరువు ఉండే ఈ డ్రోన్ పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధనౌకల సిబ్బంది కంట్లోపడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా, మెల్లగా ముందుకెళ్తుంది. అత్యవసర సందర్భాల్లో గంటకు గరిష్టంగా 14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్రజలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్డ్రోన్ మెరుగుపరుస్తుందని డీఆర్డీవో పేర్కొంది.

ఈసారి ఎండలు ఎక్కువే!
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో వివరించారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
NRI

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
క్రైమ్

విరిగిన విద్యార్థిని భుజపుటెముక
‘కర్ర’ పెత్తనం.. ఆత్మకూరు: పరీక్ష కేంద్రం చీఫ్ సాగించిన ‘కర్ర’ పెత్తనం ఓ గిరిజన విద్యార్థిని ఉజ్వల భవితకు ఆటంకంగా మారింది. చీఫ్ సూపరింటెండెంట్ విచక్షణ కోల్పోయి కర్రతో కొట్టడంతో విద్యార్థిని భుజపుటెముక విరిగి చివరి పరీక్ష రాయలేక సతమతమవుతోంది. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘శ్రీనివాసా! ఇదెక్కడి ‘కర్ర’పెత్తనం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. ఆత్మకూరు మండలం వేపచెర్ల ఎగువతండాకు చెందిన రవినాయక్ కుమార్తె శ్రావణి స్థానిక కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లోని కేంద్రంలో ఆమె పరీక్షలు రాస్తోంది. శనివారం పరీక్ష రాస్తూ జవాబు తోచక దిక్కులు చూస్తున్న శ్రావణిని అక్కడకు చేరుకున్న ఆ కేంద్రం చీఫ్ శ్రీనివాసప్రసాద్ (ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం) కర్రతో కొట్టాడు. నొప్పి తాళలేక ఆమె విలవిల్లాడుతూ.. ‘సార్ కొట్టకండి’ అంటూ ప్రాధేయపడిన వినకుండా పదేపదే కర్రతో కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పరీక్ష ముగిసిన తర్వాత కేజీబీవీకి చేరుకున్న ఆమె జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలపడంతో ఆయన ఆదివారం వచ్చి కుమార్తెకు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. ఆ సమయంలో తాను పరీక్ష రాయనంటూ బాలిక మొండికేయడంతో మంగళవారం చివరి పరీక్ష ఒక్కటి రాయాలని తండ్రి సముదాయించడంతో సరేనని ఒప్పుకుంది. అయితే రాత్రికి నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో సమాచారం అందుకున్న రవినాయక్ సోమవారం ఉదయం కుమార్తెను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కుడిచేతి భుజపుటెముక విరిగినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రావణి కుడి చేతికి కట్టు కట్టి పంపించారు. చివరి పరీక్ష రాసేందుకు వీలు కాని పరిస్థితిలో ఉన్న బాలిక దుస్థితిపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా... 9వ తరగతి విద్యార్థిని సహాయకురాలిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస ప్రసాద్ వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన పదో తరగతి విద్యార్థినిని కొట్టారని, మరో ఇద్దరు విద్యార్థులు అత్యవసరంగా బాత్రూమ్కు వెళ్లి వస్తుండగా వారిని పరీక్ష రాయనీయకుండా దాదాపు అరగంటకు పైగా తన గదిలోనే నిలబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రావణి విషయం తెలియగానే ఆత్మకూరు వాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు తప్పు చేస్తే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఎముకలు విరిగేలా కర్రతో కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో ఘటన పదో తరగతి పరీక్షలు రాస్తుండగా గిరిజన విద్యార్థినిని కర్రతో కొట్టిన కేంద్రం చీఫ్ ఎక్స్‌రేలో బహిర్గతమైన దుర్మార్గం

హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

బస్సును ఓవర్టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్‌బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్‌ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్‌లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది.
వీడియోలు


విజయవాడలో ధర్నాకు దిగిన మున్సిపల్ కార్మికులు


Anjali Incident: సీసీటీవీ ఫుటేజ్ తల్లిదండ్రులకు ఎందుకు చూపించడం లేదు


భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్


ముంబై వీధుల్లో చక్కర్లు కొడ్తున్న విజయ్ & రష్మిక ..


దేవర 2 పై భీభత్సమైన అప్డేట్


కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్


టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ ను పీకి పక్కన పడేసిన లోకేష్


చంద్రబాబు బుద్ధి మారాలని ప్రార్దించా..


P-4 ప్రోగామ్ పై భువనేశ్వరి కి చెల్లుబోయిన సూటి ప్రశ్న