మైనర్‌ బాలికకు పెళ్లి..! ఇంకా వీడని బాల్య వివాహాల రీతి.. | - | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికకు పెళ్లి..! ఇంకా వీడని బాల్య వివాహాల రీతి..

Published Tue, Aug 8 2023 12:24 AM | Last Updated on Tue, Aug 8 2023 8:02 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు వివాహం జరిపించారు. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతుల పెద్ద కూతురు (14) కాగా నిర్మల్‌ రూరల్‌ మండలంలోని గంగ, పాపయ్య దంపతుల కుమారుడు నగేశ్‌(33)తో ఆదివారం కొండాపూర్‌లో వివాహం జరిపించారు. బాలిక మేనమామ రాందాస్‌ రూ.25వేలు తీసుకుని కార్యక్రమాన్ని అంతా దగ్గరుండి జరిపించాడు.

సోమవారం ఉదయం బాలిక సర్పంచ్‌ కనిష్‌ ఫాతిమాను ఆశ్రయించింది. గత జులైలో నగేశ్‌కు మొదటి వివాహం జరిగి విడాకులైంది. ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మి విశారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. సదరు బాలికను నిర్మల్‌ సఖీ కేంద్రానికి తరలించామన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement