నేరడిగొండ:
జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో వడదెబ్బ బారిన ప డకుండా ఉండొచ్చని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చెబుతున్నారు. ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా నమోదు కానున్నట్లు వా తావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల విషయమై ‘సాక్షి’తో పలు విషయాలు చెప్పారు. ఎండలో తిరగడం, తీవ్రమైన వడగా లులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో ఆయన మాటల్లోనే..
సాక్షి: వడదెబ్బ లక్షణాలు ఏంటీ..?
డైరెక్టర్: మానవ శరీరంలో తీవ్రమైన తలనొ ప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారకస్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సాక్షి: వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చికిత్స ..?
డైరెక్టర్: వడదెబ్బకు గురైన వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా నీడలోకి తీసుకెళ్లాలి. చల్లని నీ టితో ముంచిన గుడ్డతో శరీరాన్ని మొత్తం తుడవాలి. వడదెబ్బ తగి లిన వారికి ఉప్పు, మజ్జిగ, కొబ్బ రి నీళ్లు, గ్లూకోజ్, ఇ తర లక్షణా లు (ఓఆర్‌ఎస్) కలిపిన నీటిని తాగించాలి. ప్రథమ చికిత్స చేసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి కూడా తరలించవచ్చు.
సాక్షి: వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.?
డైరెక్టర్: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, టోపి, తలపాగ లాంటివి ధరించాలి. వేసవిలో ఎక్కువ శాతం చల్లని, నూలు వస్త్రాలు ధరించాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట తిరగడం, ఆడటం చేయరాదు. వివిధ రకాల పండ్లతో పాటు నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. మత్తు పానీయాలకు దూరం ఉండాలి. బయట కలుషిత ఆహారం తినవద్దు. చిన్నారులు, వృద్ధులు. గర్భిణులు మరింత శ్రద్ధ తీసుకోవాలి.
జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment