అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై ఉంటూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లను శుక్రవా రం ఆయన పరిశీలించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్ర జలంతా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. పట్టణంలోని వినాయక చౌక్, అబ్దుల్లా చౌక్, గాంధీచౌక్ అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అందరి సహకారంతో శాశ్వ త పరిష్కారం దిశగా చొరవచూపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు సునీల్, శ్రీ నివాస్, రిజర్వ్‌ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
బీఆర్‌ఎస్ నిరసన
ఆదిలాబాద్‌టౌన్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తడి ఆరిపోయి ఎండుతున్న పంట పొలాల రైతులను ఆదుకోవాలని అడిగిన పాపానికి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, మాజీ కౌన్సిలర్లు కొండ గణేశ్, దమ్మాపాల్, అశోక్ స్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాజీ ఎంపీపీ గోవర్ధన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment