సీసీఐ పునరుద్ధరణపై ప్రకటన చేయించాలి
కై లాస్‌నగర్: జిల్లా అభివృద్ధిపై స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీసీఐ పునరుద్ధరణపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర పరి శ్రమలశాఖ మంత్రితో స్పష్టమైన ప్రకటన చేయించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశా రు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, అలాగే యంత్రాలను తుక్కు కింద విక్రయించే ఈ టెండర్ ప్రక్రియను వెనక్కి తీ సుకోవాలనే డిమాండ్‌తో సీసీఐ సాధనకమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చే పట్టారు. ఈ సందర్భంగా ఆయ న హాజరై దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణకు అన్ని విధాలా ప్రయత్నం చేశానన్నారు. ప్రస్తుత ఎంపీ నగేశ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి అనంత్ గితేను ప లుమార్లు కలిసి విన్నవించానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీసీఐ అంశాన్ని ప్ర స్తావించాలని డిమాండ్ చేశారు. ఇందులో టీఎన్జీ వోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, సాధన కమిటీ సభ్యులు నారాయణ,ప్రభాకర్‌రెడ్డి,మల్లేశ్, దేవేందర్, పో శెట్టి, రామయ్య, ప్రేమల,మహేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment