జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా..

Published Thu, Mar 20 2025 1:56 AM | Last Updated on Thu, Mar 20 2025 1:51 AM

జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా..

జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా..

● రాష్ట్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన ● సంక్షేమానికి పెద్దపీట అంటున్న కాంగ్రెస్‌ ● ఆరు గ్యారంటీల అమలేదంటున్న విపక్షాలు ● జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు

మహిళ, శిశు సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేస్తున్నారు. తొలివిడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు కాగా జిల్లాకు దాదాపు 8000 ఇళ్లకు సంబంధించిన నిధులు మంజూరు కానున్నాయి. అలాగే యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో బాలికలకు ఉచిత ఐఐటీ, నీట్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు వివరించారు.

సాక్షి,ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. శ్రీహస్తంశ్రీ పార్టీ నాయకులు ఇది అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన పద్దుగా కితాబు ఇచ్చుకుంటుండగా, ఆరు గ్యారెంటీల అమలు ఏదని బీఆర్‌ఎస్‌, బీజేపీలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలోని ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కమ్ముకున్న నీలినీడలు ఇకనైన తొలుగుతాయా చూడాల్సిందే. ప్రధానంగా భూసేకరణ వేగిరంగా జరగాల్సి ఉంది. అలాగే కుప్టి ప్రాజెక్టుకు స్వల్పంగా నిధులు కేటాయించారు. గత బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించినా ఆచరణలో మాత్రం విడుదల చేయలేదు. అలాగే సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌ల కోసం కూడా నిధుల కేటాయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రెండోసారి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025–26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పద్దును చదివారు. శాఖల వారీగా కేటాయింపులను వివరించారు. ఆయా రంగాల్లో జిల్లాకు దక్కిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

రైతు సంక్షేమం కోసం..

రైతు భరోసా కోసం అన్నదాతకు ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలోని లక్షకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌ యార్డుల్లో ఆధునిక వసతులు, నూతన సదుపాయాలకు నిధులు కేటాయించనున్నట్లు వివరించారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రత్యేక సబ్సిడీ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ పరంగా కేటాయించిన నిధులతో లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలు అందేందుకు అవకాశం ఉంది. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధుల్లో జిల్లాలోని పలు ప్రాజెక్టులకు కూడా దక్కనున్నాయి.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు..

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూ ళ్లు రాష్ట్రంలో 58 చోట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. రానున్న రోజుల్లో ని యోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని నిర్మించనున్నట్లు వివరించారు. సంక్షేమ వసతిగృహాల్లో కామ న్‌డైట్‌ స్కీమ్‌ అమలుపర్చనున్నట్లు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా రూపాంత రం చేయనుండగా, జిల్లాలోని ఐటీఐలు కూడా ఈ రకంగా మారనున్నాయి.

రోడ్లు బాగుపడేనా..

రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే హైబ్రిడ్‌ మోడల్‌లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేట్‌ నుంచి నిధులు సేకరించి రోడ్ల నిర్మాణానికి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. పంచాయతీరాజ్‌ శాఖకు కేటాయింపులతో పీఆర్‌ పరిధిలోని రోడ్లకు కూడా మహర్దశ కలగనుంది. గతేడాది వర్షాకాలంలో కురిసిన అధిక వర్షాలతో జిల్లాలో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు నిధులు వెచ్చించనున్నారు.

మహిళల సంక్షేమం కోసం..

ప్రాజెక్ట్‌ నిధుల కేటాయింపు

(రూ. కోట్లలో)

లోయర్‌ పెన్‌గంగ (కొరటా–చనాఖ) 179

కుప్టి ప్రాజెక్ట్‌ 0.50

సాత్నాల ఆధునికీకరణకు.. 85

మత్తడివాగు 30

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement