రిమ్స్‌లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ వైద్యుల పోస్టుల నియామకానికి మంగళవారం డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇంటర్వ్యూ నిర్వహించగా 33 మంది హాజరయ్యారు. సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్ పోస్టుకు ఒకరు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌కు ఒక్కొక్కరు చొప్పున హాజరైనట్లు డైరెక్టర్ తెలిపారు. పీడియాట్రిక్ విభాగంలో ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు, ఆప్తాల్మిక్‌లో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు ట్యూటర్లు, అనస్తీషియాలో ఒకరు అసోసియేట్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీబీసీడీలో ఒక సీనియర్ రెసిడెంట్, రేడియాలజీ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరైనట్లు పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెడికల్ గ్యాస్ట్రాలజీలో ఒకరు అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రాలజీలో నలుగురు, జనరల్ మెడిసిన్‌లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరైనట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment