స్కూళ్లలో స్కౌట్ యూనిట్లు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని అన్ని యాజ మాన్యాలకు చెందిన పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చే పడతామని డీఈవో ప్రణిత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన శిబిరా నికి హాజరై మాట్లాడారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే స్కౌట్ ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్కౌట్ అండ్ గైడ్స్ కార్యాలయ క్యాంపు సైట్ ప్రహరీ నిర్మాణానికి కృషి చే స్తానని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు వకుళాభరణం ఆదినాథ్, కాంచనవల్లి రత్నాకర్, కార్యదర్శి ఎన్.స్వామి, కోశాధికారి కన్నం మోహన్‌బా బు, సంయుక్త కార్యదర్శి లక్ష్మి, శిక్షణ కమిషనర్ నాగిరెడ్డి, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు దత్తు, లక్ష్మి, జీవిత తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment