సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కై లాస్‌నగర్: బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం, జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంచడాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాసేవ భవన్‌లో పా ర్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత జీవి తాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపా రు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును సాధిస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. ఇది జిల్లా అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. నాయకులు భూ పెల్లి శ్రీధర్, చరణ్‌గౌడ్, పవన్, శ్రీనివాస్, సతీశ్, నర్సింగ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment