బుర్కి గ్రామాభివృద్ధికి కృషి
● కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బుర్కి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. తొలుత అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని లబ్ధిదారులకు అందిస్తున్న పోషకాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులకు దుప్ప ట్లు, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంకోలి నుంచి గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులు మార్చి చివరిలోగా పూర్తయ్యేలా చూడాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈని, అలాగే ఓపెన్ వెల్‌కు రిటర్నింగ్ వా ల్వ్ త్వరగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎఫ్‌ఆర్వో గులాబ్‌సింగ్, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సాయి మహేశ్, పీఆర్ ఏఈ సంతోష్, ఏవో నగేష్‌రెడ్డి, ఎంపీవో స్వప్నశీల, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గంగేశ్వర్, ఎంసీ సభ్యులు విజయ్‌బాబు, కోఆర్డినేటర్లు రూపేష్ రెడ్డి, కిషన్, కిరణ్ కుమార్‌రెడ్డి, తదితరులున్నారు.
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌కు వచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలందించేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా వైద్యులను ఆదేశించారు. పట్టణంలోని రిమ్స్‌లో బుధవారం సాయంత్రం వైద్యులు, ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే వారంతా పేదలేనని వారిని దృష్టిలో ఉంచుకుని సేవలు మెరుగుపరచాలన్నారు. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో అన్ని రకాల డెలివరీలు చేయాలన్నారు. రిఫరల్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్‌ఎంవోల బాధ్యతల నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్లు అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment