అంగన్‌వాడీ టీచర్‌పై దాడి
కడెం: మండలంలోని లింగాపూర్‌తండాకు చెందిన అంగన్‌వాడీ టీచర్ ధరంసోత్ శ్రీలతపై అదే తండాకు చెందిన సురేందర్, కమల, సరోజ దాడి చేశారు. శనివారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన సరుకులు తీసుకునేందుకు శ్రీలత వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన శ్రీలతను ఖానాపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంగన్‌వాడీ టీచర్ శ్రీలతను సీడీపీవో సరిత, సూపర్‌వైజర్లు పరామర్శించారు. హోలీ పండుగ రోజున జరిగిన గొడవ కారణంగానే అంగన్‌వాడీ టీచర్‌పై దాడి జరిగినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భుక్యా రమేశ్ డిమాండ్ చేశారు.
విద్యుత్ కంచెకు తగిలి రైతు దుర్మరణం
నర్సాపూర్ (జి): పంటను అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్న రైతుకు అదే కంచె మృత్యుపాశమై కాటేసిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్ అనుబంధ నసీరాబాద్ గ్రామానికి చెందిన బొందుగుల మల్లయ్య (54) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా డు. పంటను అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చుట్టూ జీఐ వైర్ చుట్టి కరెంట్ కనెక్షన్ ఇస్తుండేవాడు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం వరకు మల్లయ్య ఇంటికి రాకపోయేసరికి అతడి భార్య చిన్నక్క వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడగా కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యం మత్తులో ఒకరి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బుర్సన్‌పటర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోన్‌కాంబ్లే విద్యాసాగర్(57) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం హోలీ సంబరాల్లో భాగంగా అతిగా మద్యం తాగాడు. అదే మత్తులో సాయంత్రం చేనుకు వెళ్లి అక్కడ గుర్తు తెలియని పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించి 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై మరొకరు..
బజార్‌హత్నూర్: మద్యానికి బానిసైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై అప్పారావ్ తెలిపిన వివరాల ప్రకారం.. జాతర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామానికి చెందిన గొడం గంగారాం(54) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం తన పంట పొలంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కడెం: మండలంలోని పెద్దబెల్లాల్ పంచా యతీ పరిధి మొర్రిగూడెం గ్రామానికి చెందిన ఆకుల సత్తెన్న (42) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం వివాహమైన సత్తెన్నకు సంతానం కలగకపోవడం, రెండేళ్ల క్రితం భార్య అ నారోగ్యంతో మరణించడంతో మద్యానికి బానిసయ్యాడు. ఒంట రిజీవితం గడుపుతున్న అతడు మనస్తాపంతో గతంలో పలు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈక్రమంలో ఈనెల 14న మద్యం సేవించి బాత్‌రూంలో టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు ఆకుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment