● వరంగల్‌కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్‌కూ సాధిస్తా ● అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ● జిల్లాలో చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు | - | Sakshi
Sakshi News home page

● వరంగల్‌కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్‌కూ సాధిస్తా ● అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ● జిల్లాలో చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు

Published Sun, Mar 16 2025 12:34 AM | Last Updated on Sun, Mar 16 2025 12:31 AM

● వరం

● వరంగల్‌కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్‌కూ సాధిస్తా ● అస

‘ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తెస్తా.. ఆ బాధ్యత నాది.. ఆ మంచి పేరు కూడా నేనే తీసుకుంటా.. మొదటి విడతలో వరంగల్‌కు తెచ్చా.. రెండో విడతలో ఆదిలాబాద్‌కు తీసుకొస్తా.. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఎయిర్‌పోర్టుల కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు.. అదే పక్క రాష్ట్రాలను చూడండి.. ఎన్ని ఉన్నాయి.. మన దగ్గర కూడా పెంచేందుకు కృషి చేస్తున్నా.. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను సాధించేందుకే ఢిల్లీ వెళుతున్నా.. కేంద్ర మంత్రులను కలుస్తున్నా.. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించి కేంద్రంలో ఉన్నవారితో ఇక్కడి బీజేపీ నేతలకు ఉన్న సంబంధాలను ఉపయోగించుకుందాం.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు’ ఇది సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శాసనసభలో అన్న మాటలు.

రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో చర్చ సా గింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌.. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి చర్చ లేవనెత్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో ఆదిలాబాద్‌ విషయంలో ముందడుగు పడటం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతవాసుల మనోభావా లకు అనుగుణంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘సాక్షి’ ప్రత్యేక చొరవ..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరంగల్‌లోని మామూనూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌కు ఎయిర్‌పోర్టు తానే తీసుకొ చ్చానని చెప్పుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్‌లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్‌మోహన్‌ నాయు డు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దేశంలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసే విషయంలో మోదీ సర్కారు చొరవ చూపుతుందని పేర్కొన్నా రు. అలాగే రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో కూడా ఏర్పాటు చేసే విషయంలో ముందుంటామని స్పష్టం చేశారు. అయితే ఆదిలాబాద్‌ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో ఈ ప్రాంతవాసుల్లో నిరాశ వ్యక్తమైంది. ప్రధానంగా ఇక్కడ మౌలిక వసతులు అందుబాటులో ఉండడం, దశాబ్దాలుగా విమానాశ్రయం ఏర్పా టు డిమాండ్‌ ఉన్నా విస్మరించడంపై ఒకింత నారా జ్‌ అయ్యారు. ఈ క్రమంలో ‘సాక్షి ’ సామాజిక బా ధ్యతగా చొరవ తీసుకుంది. ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో ‘ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు సాధన కోసం’ చర్చా వేదిక నిర్వహించింది. కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పట్ట ణానికి చెందిన మేధావులు, ప్రముఖులు పాల్గొని ఆదిలాబాద్‌కు విమానాశ్రయం ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా ఎయిర్‌పోర్టు సాధన కోసం అప్పటికప్పుడే అడహక్‌ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో రాజకీయాలకతీతంగా ఐక్య ఉద్యమానికి సిద్ధమని ప్రకటించడంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. అదే రోజు ఎంపీ గోడం నగేశ్‌, ఆదిలా బాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్టు సాధన కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాంతా నికి విమానాశ్రయం వస్తే కలిగే ప్రయోజనాలు.. అందుబాటులో ఉన్న వనరులు.. తదితర అంశాల ను ప్రస్తావిస్తూ ‘సాక్షి’ ఈనెల 9న తెలంగాణ యాసలో సండే స్పెషల్‌గా ‘మామ.. ఎయిర్‌పోర్టస్తే మనకేమస్తది’ శీర్షికన మరో కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

కేంద్రం పాజిటివ్‌గా ఉంది

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే అంశంలో కేంద్రం పాజిటివ్‌గా ఉంది. రాష్ట్రం నుంచి గతంలో బీఆర్‌ఎస్‌ సర్కారు సహకరించకపోవడంతో అనేక ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సాధన విషయంలోనే మేము ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను తరచూ కలుస్తున్నాం. అందుకే అసెంబ్లీలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. ముఖ్యమంత్రి పాజిటివ్‌గా స్పందించారు. నేను అనేది ఒకటే..‘ పేరు మీకొచ్చినా .. మా ఆదిలాబాద్‌కు మాత్రం ఎయిర్‌పోర్టు కావాలి.. అనేదే మా నినాదం’.

– పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

ఈనెల 9న ‘సాక్షి’లో సండే స్పెషల్‌ స్టోరీ

ఈనెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

No comments yet. Be the first to comment!
Add a comment
● వరంగల్‌కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్‌కూ సాధిస్తా ● అస1
1/1

● వరంగల్‌కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్‌కూ సాధిస్తా ● అస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement