దివ్యాంగులకు ‘యూడీఐడీ’
● స్మార్ట్‌కార్డుల దరఖాస్తుకు ప్రత్యేకపోర్టల్ ● కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల లబ్ధికి దోహదం ● ఒకే కార్డుతో అనేక ప్రయోజనాలు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటు కేంద్ర పథకాలను పొందేందుకు వీలుగా దివ్యాంగులకు యూనిక్ డిజ బెలిటి ఐడెంటిఫికేషన్ నంబర్ (యూడీఐడీ) స్మార్ట్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వారి వైకల్య ధ్రువీకరణపత్రాన్ని సదరం శిబిరాల్లో కాగితం రూపంలో అందిస్తున్నా రు. అందుకు నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. కార్డు పునరుద్ధరణ, కొత్త కార్డుల జారీ కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆధార్ తరహా ప్రత్యేక నంబర్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఈ నెల 8న జిల్లాలోని దివ్యాంగుల ప్రతినిధులు, డీఆర్డీఏ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి స్మార్ట్‌కార్డుల జారీపై దిశానిర్దేశం చేశారు.
దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్
యూడీఐడీ కార్డులకు దరఖాస్తు చేసుకునేందు కోసం కేంద్ర ప్రభుత్వం http://www. swavlambancard.gov. in ప్రత్యేక ఫోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీసేవ కేంద్రాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో అడిగిన వివరాలు నింపడంతో పాటు పాస్‌పోర్టుసైజ్ ఫొటో, సంతకం, ఆధార్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకోగానే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో అందుతుంది. 31.10.2023 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లు కలిగిన వారందరికీ యూడీఐడీ స్మార్టు కార్డు, సర్టిఫికెట్లు ప్రభుత్వం జనరేట్ చేసి ఉంచింది. కొంతమందికి ఆ కార్డులను నేరుగా వారు సూచించిన చిరుమానాకు పోస్టల్ ద్వారా పంపించగా మరికొందరి కార్డులను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి పంపించింది. కార్డు రానటువంటి వారెవరైనా ఉంటే యుడీఐడీ పోర్టల్‌లో ఆధార్‌కార్డు, మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును సైతం కల్పించింది.
జిల్లాలోని దివ్యాంగుల వివరాలు
కేటగిరీ దివ్యాంగులు
ఆర్థోపెడిక్ 6,535
దృష్టిలోపం 1,266
వినికిడి లోపం 1,315
మానసిక వైకల్యం 1,295
దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని దివ్యాంగులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయనున్న యుడీఐడీ స్మార్ట్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు అవగాహన కల్పించేలా వీవోఏలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు పంచాయతీ కార్యదర్శులు విస్తృత ప్రచారం కల్పించాలి. సదరం సర్టిఫికెట్ కలిగిన వారికి కూడా ఈ స్మార్ట్‌కార్డులు నేరుగా వారి ఇంటి వద్దకే రానున్నాయి. ఏమైనా సందేహాలుంటే ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment