ఏఐతో నాణ్యమైన విద్యాబోధన
● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన వి ద్యాబోధన అందుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్–ఏఎక్సల్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ ఎంతగానో దోహద పడుతుందన్నారు. స్టెప్ ఫౌండేషన్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్‌గౌడ్, హెచ్‌ఎం నారాయణ, శిక్షకుడు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల గోడౌన్ పరిశీలన
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివి ధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. స్ట్రాంగ్ రూం సీల్ తీయించి అందులో భద్రపర్చిన ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీ లించారు. అనంతరం యథావిధిగా సీల్ వేయించా రు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి జిల్లా ఓటర్లకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల కు వివరించారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల తదితరులు పాల్గొన్నారు.
వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో
మాత్రలు వేసుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: క్షయ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వంద రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంకోలి పీహెచ్‌సీలో టీబీ పెషెంట్స్‌కు నిక్షయ పోషణ్ కిట్స్‌ను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, గ్లాండ్‌ఫార్మా ప్రతినిధులు రఘురామన్, గిరీష్, సుబ్బరాజు, లోక భారతి ట్రస్టు ప్రతినిధి కుమారన్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు మనోహర్, సాధన, డీటీసీవో సుమలత, ఎన్‌సీడీ పీవో శ్రీధర్, డీఎల్‌వో గజానంద్, మండల వైద్యాధికారులు ఆశాకిరణ్, సర్ఫరాజ్, టీబీ ఎంవో సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment