సరిహద్దులో నిఘా పెంచాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
తాంసి: ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రను ఆనుకుని ఉన్నందున అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో నిఘా పెంచాలని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆవరణలో మొక్క నాటారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె.ఫణిందర్, ఎస్సై రాధిక, ఉన్నారు. తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన ఎస్పీని గ్రామస్తులు సన్మానించారు.
తలమడుగు పోలీస్‌స్టేషన్ తనిఖీ..
తలమడుగు: మండలకేంద్రంలోని పోలీస్ స్టే షన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట ఎస్సై అంజమ్మ, సిబ్బంది ఉన్నారు.
ఏప్రిల్ 20 నుంచి
‘ఓపెన్’ పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. ఉద యం 9 నుంచి మ ధ్యాహ్న 12 గంటల వర కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విషయాన్ని అభ్యాసకులు గమనించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment