అన్నదాతకు అండగా ప్రభుత్వం
తాంసి: రైతులు సాగు చేస్తున్న ప్రతీ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంట దిగుబడులను విక్రయించుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో కేశవ్, ఏవో రవీందర్, రైతులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన పలు వురు లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి శనివారం కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. తాంసి ఎంపీడీవో కార్యాలయంలో 35 మందికి, భీంపూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 57 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, నలందప్రియ, ఎంపీడీవోలు మోహన్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment