సెల్‌టవర్ పనులు నిలిపివేయాలి
కై లాస్‌నగర్: అనుమతుల్లేకుండా చేపట్టిన సెల్‌టవర్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పట్టణంలోని న్యూహౌసింగ్‌బోర్డు పరిధి లోని జూబ్లీహిల్స్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. శనివారం టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో పిల్లలతో కలిసి మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ, టవర్ నిర్మాణంతో ఆరోగ్యపరంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయన్నారు. పనులు వెంటనే నిలిపివేయాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. పనులు ఆపేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment