● మోడల్ ఇళ్లకే పరిమితమైన ఇందిరమ్మ నిర్మాణాలు ● తొమ్మిద
తలమడుగు మండలం లక్ష్మిపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోస్తున్న హౌసింగ్ ఏఈ
తలమడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోస్తున్న హౌసింగ్ ఏఈ
కై లాస్‌నగర్: ఇంటిస్థలం కలిగిన నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు ఆరంభంలోనే జాప్యం జాప్యమవుతున్నా యి. పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేశారు. జనవరి 26న అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి మంజూరు పత్రాలు అందజేశారు. రెండు నెలలవుతున్నా ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోయడం (మార్కవుట్) షురూ చేయలేదు. కొన్నిచోట్ల ముగ్గు పోసినా పునాదులు తవ్వుకున్నారే తప్ప నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు కేవలం మోడల్ ఇళ్లకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిర్మాణాలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన హౌసింగ్‌శాఖకు అధికారులు లేకపోవడం గమనార్హం. ఐటీడీఏ, పీఆర్ శాఖలకు బాధ్యతలు అప్పగించినా వారు వాటిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థతి నెలకొంది. ఆరంభంలోనే ఇలా ఉంటే నిర్మాణాలు ఏ విధంగా పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
216 చోట్ల మాత్రమే ముగ్గు..
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఒక్కో గ్రామంలో తొలుత ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు చేపట్టాలని సంకల్పించారు. ఆదిలాబా ద్ మున్సిపాలిటీ మినహా 17 మండలాల్లోని 17 గ్రా మాల్లో అర్హులైన వారిని గుర్తించారు. వాటి పరిధిలో 2,148 మందికి ఇళ్లను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా నిర్మాణాల్లో మాత్రం వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఎనిమిది గ్రామాల్లో 216 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ఇందులో కొన్ని చోట్ల పునాదులు తవ్వుకున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి. మరో తొమ్మిది గ్రామాల్లో ఇప్పటి వరకు ముగ్గు సైతం పోయకపోవడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ
ముగ్గు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు హౌసింగ్‌శాఖలో లేరు. ఆ శాఖలో పీడీ, డీఈతో పాటు కేవలం ఒకే ఒక ఏఈ మాత్రమే ఉన్నారు. దీంతో 17 మండలా ల్లోని ఇళ్లను పర్యవేక్షించడం వీరికి కత్తిమీద సాములా మారింది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖకు ఆరు మండలాలు, ఐటీడీఏకు నాలుగు మండలాల బాధ్యతలు అప్పగించగా హౌసింగ్‌లోని ఆ ముగ్గురు అధికారులు ఏడు మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం లేకపోవడం, పీఆర్, ఐటీడీఏ అధికారులు ఇందిరమ్మ ఇళ్లను ప ట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే నిర్మాణాలు ఊపందుకుంటే పరిస్థితి ఏంటనే అభిప్రా యం సర్వత్రా వ్యక్తమవుతుంది.
స్థలం నిబంధనల సడలింపు
గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం, పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవాటిగా చూపి బిల్లులు లేపుకో వడం, ఉపాధి నిధులు కావడంతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. సర్వే సమయంలో చూపిన స్థలంలోనే ఇళ్లను నిర్మించుకునేలా దానికి జియో పెన్సింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ విధానంలో యాప్‌లో లబ్ధిదారు వివరాలు, ఇంటి స్థలం వంటి సమాచారం నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో పలుచోట్ల నెట్‌వర్క్ లేకపోవడం, సర్వర్ సమ స్య తలెత్తడం వంటి కారణాలతో ఆవివరాలు నమో దు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో నిర్మాణ స్థలంలో మార్కవుట్ ఇచ్చేందుకు సమ స్య తలెత్తింది. దీన్ని గమనించిన అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థలం క్యాప్చర్ నిబంధనలో సడలింపునిచ్చింది. సర్వే సమయంలో చూపిన స్థలమే కాకుండా లబ్ధి దారు తమకు నచ్చిన చోట ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో మార్కవుట్‌ను గౌండ్రింగ్ చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు
మండలం గ్రామం మంజూరైన మార్కవుట్
ఇళ్లు ఇచ్చినవి
ఆదిలాబాద్‌రూరల్ పిప్పల్‌దరి 145 00
బజార్‌హత్నూర్ అందుగూడ 134 20
బేల డోప్టాల 83 20
భీంపూర్ బెల్సారిరాంపూర్ 133 57
బోథ్ కుచులాపూర్ 232 35
గాదిగూడ సావిరి 117 00
గుడిహత్నూర్ వైజాపూర్ 149 00
ఇచ్చోడ నవేగావ్ 118 00
ఇంద్రవెల్లి గట్టేపల్లి 126 00
జైనథ్ పిప్పర్‌వాడ 101 23
మావల వాగాపూర్ 152 45
నార్నూర్ బాబేఝరి 160 00
నేరడిగొండ వాంకిడి 53 00
సిరికొండ రిమ్మ 153 00
తలమడుగు లక్ష్మిపూర్ 69 10
తాంసి హస్నాపూర్ 67 06
ఉట్నూర్ మత్తడిగూడ 156 00
వేగవంతమయ్యేలా చర్యలు
స్థలం క్యాప్చర్‌లో జియోపెన్సింగ్ నిబంధన ఉండటంతో నెట్‌వర్క్ లేకపోవడం, సర్వర్ సమస్యతో యాప్‌లో వివరాల నమోదుకు అంతరాయం ఏర్పడేది. దీంతో ఇళ్ల నిర్మాణాల మార్కవుట్‌లో ఆలస్యమైంది. ప్రభుత్వం తాజాగా ఆ నిబంధనలు సడలించడంతో పాటు పీఆర్, ఐటీడీఏ అధికారులకు కూడా కొన్ని మండలాల బాధ్యతలు అప్పగించాం. దీంతో మార్కవుట్‌ను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేసి పనులు వేగంగా సాగేలా దృష్టి సారిస్తాం.
– నసీర్, హౌసింగ్ ఏఈ
Comments
Please login to add a commentAdd a comment