సర్కారు బడుల్లో ‘ఏఐ’
● విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం ● 3,4,5 తరగతుల వారికి ప్రత్యేక బోధన ● జిల్లాలో 8 పాఠశాలలు ఎంపిక ● ఇదివరకే నాలుగు చోట్ల ప్రారంభం ● నేడు మరో నాలుగు బడుల్లో షురూ
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు పాఠశాలల్లో విద్యా ప్ర మాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించింది. ఈ మేరకు 3,4,5 తరగతు ల విద్యార్థులకు సాంకేతిక పద్ధతిలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ పద్ధతుల్లో విద్యాబోధన చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లా ఎంపికై ంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో పది మంది విద్యార్థులను ఎంపిక చేసి బోధించనున్నా రు. వారిలో ప్రగతి ఆధారంగా మిగతా వారికి బోధ న కొనసాగించనున్నారు. శనివారం నాలుగు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు మరో నాలుగు పాఠశాలల్లో కలెక్టర్ ప్రారంభించనున్నారు. చతుర్విద ప్రక్రియలతో పాటు మెరుగైన సా మర్థ్యాలను అందుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈకే, స్టెప్ ఫౌండేషన్ సహకారంతో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించారు. ఉన్నత పాఠశాలల్లోని ఆవరణలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి కృత్రిమ మేద ద్వారా తరగతులను బోధించనున్నారు.
సాంకేతిక విద్యా విధానాలే లక్ష్యంగా..
పాఠశాల విద్యా శాఖ ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పనిచేసే స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ ఫౌండేషన్ విద్యా రంగంలో డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ గుజ రాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో కలిసి ఇప్పటికే పని చేస్తుంది. ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు, పాఠశాల విద్యలో నూతన అభ్యాస పద్ధతులు, డేటా ఆధారిత అధ్యయన విశ్లేషణలు, ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. జిల్లాలోనూ ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో భోరజ్ మండలంలోని పిప్పర్‌వాడ, బాలాపూర్, జైనథ్ మండలంలోని అడ, ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్, తాటిగూడ, తలమడుగు మండలంలోని ఖోడద్, దేవాపూర్ తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. నాలుగు పాఠశాలల్లో శనివారం ప్రారంభించగా, మరో నాలుగు పాఠశాలల్లో సోమవారం నుంచి షురూ చేయనున్నారు.
ఏఐతో విద్యాబోధన..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎనిమిది ఎంపికై న విషయం తెలిసిందే. 3,4,5 తరగతుల విద్యార్థులకు ఈ విధానం ద్వారా బోధన చేపట్టనున్నారు. ఈ మూడు తరగతుల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారానికి రెండు రోజుల పాటు తెలుగు, మరో రెండు రోజుల పాటు గణితం బోధించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యాబోధన చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. విద్యార్థి పాఠాలను అర్థం చేసుకుంటున్నారా.. లేదా అనేది ఏఐ గుర్తి స్తుంది. విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థం కానట్లయితే సరళమైన మార్గంలో ఏఐ బోధన చేస్తుంది. ఇలా ప్రతీ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయనుంది. అనంతరం విద్యార్థులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
పకడ్బందీగా అమలు ..
జిల్లాలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యా యి. నాలుగు చోట్ల ఇప్పటికే కార్యక్రమం ప్రా రంభం కాగా, మిగతా నాలుగు పాఠశాలల్లో కలెక్టర్ సోమవారం ప్రారంభించనున్నారు. టెక్నాలజీ ద్వారా విద్యాబోధనతో విద్యార్థుల సామర్థ్యాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ అందించాం. పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – ప్రణీత, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment