రైతులను చైతన్యపర్చి ఉద్యమిస్తాం
ఆదిలాబాద్‌టౌన్: కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, ఈ మేరకు రైతులను చైతన్యపరిచి ఉద్యమ కా ర్యాచరణ ప్రకటిస్తామని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షు డు హన్మంత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏఐకేఎస్ జిల్లా 7వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ ఈ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు గతంలో మూడు నల్ల చ ట్టాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా రైతులు ఉద్యమించినట్లు పేర్కొన్నారు. 764 మంది రైతులు చనిపోవడంతో మోదీ సర్కా రు దిగివచ్చి వాటిని రద్దు చేసినట్లు తెలిపారు. మళ్లీ దొడ్డిదారిన అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్, దేవిదాస్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, పోశెట్టి, భాస్కర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
● ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment