‘ఎల్‌ఆర్‌ఎస్’ సద్వినియోగం చేసుకోండి
కై లాస్‌నగర్: ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ఈ నెల 31లోపు ఫీజు చెల్లించి 25శాతం రాయితీ పొందాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆదివారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రత్యేక మేళా నిర్వహించారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన పలువురికి అప్పటికప్పుడు ప్రొసీడింగ్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా అక్రమ లేఅవట్‌లోని ప్లాట్లను సక్రమం చేసుకోవడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు సులభంగా పొందవచ్చన్నారు. తక్కువ ఫీజుతోనే ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. ఇందులో టీపీఓ సుమలత, వార్డు ఆఫీసర్లు అక్షయ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, కుమ్ర లక్ష్మణ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment