ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆదిలాబాద్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్ కాలనీలో నిర్మించనున్న శ్రీ సీ తారామచంద్రస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సనాతన ధర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ భావితరాలకు తెలపాలన్నారు. అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణానికి పునాదులు పడుతాయన్నారు. కార్యక్రమంలో విజ్జగిరి నారాయణ, కోవ రవి, దమ్మ పాల్, కొండ గణేశ్, నల్ల మహేందర్, రామేశ్వర్, చిందం శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment