అంగన్‌వాడీల ఆందోళన
కై లాస్‌నగర్: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకం, మోబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను రద్దు చే యాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట 48గంటల మహాధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీలు, ఆయాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం అమలైతే అంగన్‌వాడీ కేంద్రాల మనుగడే ఉండదన్నారు. ఈ చ ట్టా న్ని నిలిపివేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి అక్కడే వంటావార్పు నిర్వహించిన అంగన్‌వాడీలు నిరసన శిబిరంలోనే నిద్రించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీ త, జయలక్ష్మి, మంగ, వెంకటమ్మ, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment