జైనథ్ మార్కెట్‌లో గందరగోళం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ వ్యవసాయ మా ర్కెట్ యార్డులో సోమవారం గందరగోళం నెలకొంది. హమాలీలు, మార్కెట్ కార్యదర్శి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగడంతో శనగ కొనుగోళ్లు నిలి చిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చారు. యార్డులో ఉదయం 10గంటలకు ప్రా రంభం కావాల్సిన కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ఎండలోనే బారులు తీరాల్సిన పరి స్థితి. మార్కెట్ అధికారుల అలసత్వం కారణంగా ఈ వ్యవహారం రచ్చకెక్కింది. పాతవారితో తూ కం సాఫీగా సాగుతున్నా కొత్త వారిని రంగంలోకి దింపడంపై ఆగ్రహం వ్యక్తమైంది.
గొడవ ఇలా..
బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు కొన్నేళ్లుగా హమాలీలుగా పనిచేస్తున్నారు. వీరిని గుత్తేదారు మనోజ్ తీసుకొచ్చి ఏటా సోయా, కందులు, శన గ పంట లోడింగ్, అన్‌లోడింగ్, తూకం చేయించ డం వంటి పనులు చేయిస్తున్నాడు. అయితే జైన థ్ మండలంలోని ఓ పార్టీకి చెందిన నాయకుడు లేబర్ లైసెన్స్ తీసుకుని కూలీలను సోమవారం యార్డుకు తీసుకువచ్చాడు. దీంతో బిహార్‌కు చెందిన హమాలీలు, కొత్త గుత్తేదారు మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. 15ఏళ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని వాహనాల నుంచి లోడింగ్, ఆన్‌లోడింగ్ చేస్తున్నామని బిహార్‌కు చెందిన గుత్తేదారు పేర్కొన్నాడు. తమ పొట్టకొట్టి కొత్త వారిని ఎలా తీసుకుంటా రని ప్రశ్నించాడు. ప్రస్తుత హమాలీలకు ముఖ ద్దాంగా ఉన్న తాను కొన్నేళ్లుగా కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్లు పేర్కొన్నాడు. మా ర్కెట్ కమిటీ చైర్మన్, కార్యదర్శి తనను డబ్బులు డిమాండ్ చేశారని తెలిపాడు. ఇటీవల చేపట్టిన సోయా, కందుల కొనుగోళ్ల సమయంలో మా హమాలీలు కొనసాగాలంటే రూ.4లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని అన్నాడు. తాను అంతగా ఇవ్వలేనని రూ.1.50 లక్షలు ఇస్తానని చె ప్పాడు. ఈక్రమంలో చైర్మన్ కుమారుడికి ఆన్‌లైన్ ద్వారా రూ.1.20 లక్షలు, అలాగే మరో రూ.30 వేలు నగదు అందించినట్లు పేర్కొన్నాడు.మిగతా డబ్బుల కోసమే తనను తొలగించేందుకు కుట్ర పన్నారని వాపోయాడు. మార్కెట్ కార్యదర్శి సై తం తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆరో పించాడు. కాగా శనగలు విక్రయించేందుకు వచ్చి న రైతులు పాత గుత్తేదారు, హమాలీలతోనే తాము తూకం చేయించుకుంటామని వారికి మ ద్దతుగా నిలిచారు. కొత్త ముఖద్దాం తెచ్చిన హ మాలీలతో తమ శనగలను తూకం వేయించమని భీష్మించారు. కాగా కొత్త ముఖద్దాం తాను మండలానికి చెందిన వ్యక్తి అని బిహార్‌కు చెందిన ము ఖద్దాంకు కాకుండా తాను తెచ్చిన కూలీలతోనే తూకం వేయించాలని పేర్కొన్నాడు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత మార్క్‌ఫెడ్, నాఫెడ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై మార్కెట్ కార్యదర్శి దేవన్నను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌లో యత్నించగా స్పందించలేదు. తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకున్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా బిహార్ రాష్ట్రానికి చెందిన గుత్తేదారు సక్రమంగా పనులు చేపట్టడం లేదని, ఇదివరకే ఆయనను చెప్పామన్నారు. తాను డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదని స్ప ష్టం చేశాడు. మార్కెట్ కమిటీ తీర్మానం చేసి ఆ గుత్తేదారుడిని తొలగిస్తామని పేర్కొన్నాడు.
మధ్యాహ్నం వరకు నిలిచిన శనగ కొనుగోళ్లు
ఆందోళనకు దిగిన హమాలీలు
పాత వారి తొలగింపుపై ఆగ్రహం
మార్కెట్ చైర్మన్ రూ.4లక్షలు డిమాండ్ చేశారని గుత్తేదారు ఆరోపణ
పాత హమాలీలకే రైతుల మద్దతు
జైనథ్ మార్కెట్‌లో గందరగోళం
Comments
Please login to add a commentAdd a comment