ఏఐతో అభ్యసన సామర్థ్యాల పెంపు
● కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడనున్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని పిప్పర్‌వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యాబోధన కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ కార్నర్‌ను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు విజయోత్సవ లేఖలతో పాటు హాల్‌టికెట్లు అందజేసి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఇందులో డీఈవో ప్రణీత, హెచ్‌ఎం శశికళ, నవనీత, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణు, ఎంఈవో శ్రీనివాస్, ప్రఽశాంత్ రెడ్డి, సంతోష్‌రెడ్డి, యువనేస్తం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment