కుష్ఠు నివారణకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: కుష్ఠును ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే అంగవైకల్యం రాదని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ పీహెచ్‌సీ పరిధిలో సోమవారం కుష్ఠు గుర్తింపు సర్వే ప్రారంభించారు. ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కుష్ఠు పోస్టర్లు, అవగాహన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి 15 రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజ లు సహకరించాలని కోరారు. సర్వే నిమిత్తం జిల్లాలోని 22 పీహెచ్‌సీ, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1002 బృందాలను ఏర్పాటు చేశామని, వీరిని పర్యవేక్షించడానికి 200 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి గజానన్, అర్బన్ పీహెచ్‌సీ వైద్యులు వినోద్, డీపీఎంవో వామన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment