సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చూడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రూ.18వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ ఐ, పింఛన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఏఎన్‌ఎం శిక్షణ పూర్తి చేసి న వారికి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5లక్షలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుంటే ఉద్యమం ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, లత, ఆశ, అనిత తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment