నిధులు కేటాయించాలి
ఆదిలాబాద్‌టౌన్: పార్లమెంట్ సమావేశాల్లో సీసీఐ పునఃప్రారంభానికి నిధులు కేటా యించాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐ పునఃప్రారంభానికి ప్రయత్నించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీ నిపై కలెక్టరేట్ ఎదటు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కమిటీ కోకన్వీ నర్లు విజ్జగిరి నారాయణ, వెంకట్ నారాయణ, లంక రాఘవులు, అరుణ్‌కుమార్, లోకా రి పోశెట్టి, జగన్‌సింగ్, ఈశ్వరిదాస్, ఆర్.రమేశ్, అగ్గిమల్ల గణేశ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment