● నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ‘భట్టి’ ● గతేడాది కేటా
పొలాలకు రోడ్లు వేయాలి
వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించి ప్రతిపాదనలూ అందజేశాం. బీటీ రోడ్లకు మరమ్మతు చేయాలి. వానాకాలం కంటే ముందే లోతట్టు ప్రాంతాల వద్ద బ్రిడ్జీలు నిర్మించాలి. కొరాట–చనాకాకు నిధులు విడుదల చేసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. సాత్నాల ఆయకట్టు కెనాల్ లైనింగ్ పనులు చేపట్టాలి. ఇందుకు నిధులు కేటాయించాలి.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
బడుల్లో వసతులు కల్పించాలి
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు లేక పలు పాఠశాలల్లో కింద పడుకుంటున్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలి. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ సర్కారు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ పద్దు చదవనున్నారు. బడ్జెట్‌లో జిల్లాకు ఒనగూరే చర్యలు ఏవైన ఉంటాయా.. అని జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. గతేడాది బడ్జెట్‌లో నామమాత్రంగా జిల్లాకు కేటాయింపులు జరిగినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నేటి బడ్జెట్‌లో జిల్లాకు స్వాంతన లభించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేయూత ఉంటుందో.. లేదో చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి నిధులు కేటాయిస్తారా.. అనేది చూడాల్సిందే. కొన్ని ప్రాజెక్ట్‌లు అసంపూర్తిగా ఉండగా, మరికొన్ని ప్రారంభించాల్సి ఉంది. రహదారులు, బ్రిడ్జీల నిర్మాణంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాల్సిందే.
వీటిపై ముందడుగు పడేనా?
● తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరట గ్రామం వద్ద సరిహద్దు మహారాష్ట్రలోని చనాక మధ్యలో పెన్‌గంగా నదిపై ఇదివరకే బ్యారేజ్ నిర్మించారు. దీనికి సంబంధించి పంప్‌హౌస్, ఎల్‌పీపీ కెనాల్ పనులు కూడా పూర్తయ్యాయి. నీటి ఎత్తిపోతలకు సంబంధించి ప్ర యోగాత్మకంగా డ్రైరన్, వెట్‌రన్ కూడా నిర్వహించారు. ఇక ప్రధాన కెనాల్ నుంచి కాలువలు, ఉప కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి భూసేకరణతో పాటు నిర్మాణానికి సంబంధించి మరో రూ.250 కోట్లు అవసరమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఎల్‌పీపీ కాలువ ద్వారా 37,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. పిప్పల్‌కోటి రిజర్వాయర్ ని ర్మాణం కోసం మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీని నుంచి కొరాట–చనాకా కెనాల్ నిర్మించాల్సి ఉంది. తద్వారా లక్ష్యంలోని 13,500 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించేందుకు దోహదపడుతుంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నా యి. ప్రభుత్వం దీనికి నిధులు కేటాయిస్తుందా.. లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
● నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. 2018లో రూ.794 కోట్ల వ్యయంతో నిర్మించాలని అంచనా వేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పలుసార్లు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అంచనా వ్యయాన్ని అధికారులు సవరిస్తూ వచ్చారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,323 కోట్లకు చేరింది. త్వరలో నూతన ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ఈ అంచనా వ్యయం మరింత పెరగనుంది. 5.30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించనుండగా, కడెం ప్రాజెక్ట్ కింద స్థిరీకరణకు నోచుకోని 25,267 ఎకరాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో దీనిని నిర్మించతలపె ట్టారు. అయితే ఇప్పటివరకు ఒక్క అడుగు కూ డా ముందుకు పడలేదు. అంతే కాకుండా ఇక్కడ నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రానున్న రోజుల్లో బోథ్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చనే ఆలోచన ఉంది. అలాగే కుంటాల జలపాతానికి ఏడాది పొడవునా నీటి కళ ఉండేలా ప్రణాళిక చేశారు.
● జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మధ్యలో ఈ పనులు వివిధ కారణాలతో ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ ప్రాజెక్ట్‌కు రూ.27 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వాటికి సంబంధించి ఈ బడ్జెట్‌లో కేటాయింపులుంటాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు
బడ్జెట్‌కు ముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అందజేశారు. వాటికి బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, బోథ్, ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో కేటాయింపులపై సంబంధిత ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతేకాకుండా స్వల్పంగా నిధులు కేటాయించినా అవి కూడా విడుదల చేయకపోవడంతో వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది.
● నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ‘భట్టి’ ● గతేడాది కేటా
● నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ‘భట్టి’ ● గతేడాది కేటా
Comments
Please login to add a commentAdd a comment