తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్ష
కై లాస్‌నగర్: జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, భూగర్భ జలాల పెరుగుదలకు చేపట్టా ల్సిన చర్యలపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. పంపుహౌస్, బోర్‌వెల్స్, బావులు, మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతు చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలు, మున్సి పాలిటీల్లో నీటి సమస్యను గుర్తించి వెంటనే నివేదిక అందించాలని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, బజార్‌హత్నూర్ మండలాల్లోని సమస్యాత్మక హ్యాబిటేషన్లలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధిహామీ కింద ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 100 రోజుల పని కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఉదయం 6నుంచి 11గంటలలోపే పనులు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడకుండా పని ప్రదేశంలో కూలీలు గంటకోసారి నీరు తాగేలా చూడాలని సూచించారు. వేసవికాలం ముగిసే దాకా కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందుల కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎల్పీవో ఫణీందర్‌రా వు, గ్రౌండ్ వాటర్ ఏడీ శ్రీవల్లి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈలు, ఈసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment