కలెక్టర్‌కు స్కోచ్ పురస్కారం
కై లాస్‌నగర్: క లెక్టర్ రాజర్షి షాకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలోని లోధి రోడ్‌లో గల ఇండియా హ్యబిటేట్ సెంటర్‌లో కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. బాలల ది నోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గతేడాది నవంబర్ 14న ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం ప్రార్థన సమయంలో ఆరోగ్య సంరక్షణకు అనుసారించాల్సిన విధానాలపై ఉపాధ్యాయులు, వైద్యు ల ద్వారా వారికి అవగాహన కల్పించారు. ప్రతీ వారం మండలానికి రెండు పాఠశాలల చొప్పు న గైడ్ టీచర్లు, స్టూడెంట్ లీడర్లతో కలెక్టరేట్‌లో సమీక్షించి వారంలో పాఠశాలలో జరిగిన మా ర్పులను తెలుసుకుని మరింత పకడ్బందీగా అమలు చేసేలా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలో మార్పులు వచ్చాయి. కలెక్టర్‌కు ఈ అవార్డు రావడంపై పలువురు అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ‘సీఎం ప్రజావాణి’ అమలుపై సమీక్ష
కై లాస్‌నగర్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ తీరుపై కలెక్టర్ రాజర్షి మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఫిర్యాదుల పరి ష్కార అధికారులు, ఐఎఫ్‌సీ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో శిక్షణ, సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అందిన దరఖాస్తులు.. వాటి డా టా ఎంట్రీ, పరిష్కారానికి చేపట్టిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. పైలెట్ ప్ర జావాణిలో అందిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెనీ కలెక్టర్ అభిగ్యాన్, జెడ్పీ సీఈవో జి తేందర్‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీ ల్దార్లు, ఉపాఽధిహామీ ఏపీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment