రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర, కొత్త కిండ్ర గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్లవానకు పది మందికి చెందిన దాదాపు మూడు వందల ఎకరాల్లోని జీడిమామిడి తోటల్లో పిందెలు రాలిపోయాయి. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వడగళ్లు పడడంతో పూత, పిందె రాలిపోయి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని రైతులు గుమ్మిడి అచ్చమ్మ, పాము అప్పారావు, పొట్టబోయిన తాతబ్బాయి, యాదల రాజు తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల్లో పంట చేతికి వస్తుందన్న ధీమాతో అప్పులు చేశామని, వాటిని ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.
వడగళ్ల వానతో జీడిమామిడికి నష్టం