కొమ్మాది: రుషికొండలోని శ్రీమహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న టీటీడీ అర్చకులచే పంచాంగ పఠనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వేకువజామున 4 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం, 4.30 నుంచి 6 గంటల వరకు అర్చన, కొలువు, తోమాల, సహస్ర నామార్చన, 6 నుంచి 8.30 గంటల వరకు సర్వ దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 8.30 నుంచి 9 గంటల వరకు అర్చన, 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఆస్థానం, పంచాంగ పఠనం, రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనం, 7 నుంచి 7.40 వరకు అర్చన, 7.40 నుంచి 9.30 గంటల వరకు సర్వ దర్శనం, 9.30 నుంచి 10 గంటల వరకు ఏకాంత సేవ ఉంటుందని, భక్తులు గమనించాలని సూచించారు.