
ప్రపంచ రికార్డు సాధనకు కృషి
అరకులోయటౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 7వ తేదీన 20 వేల మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు, యోగభ్యాసన కార్కక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.ఎన్.దినేష్‌కుమార్ చెప్పారు. యోగా సాధన చేస్తున్న అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. వచ్చే నెల 7న నిర్వహించనున్న కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల తరలిస్తున్నట్టు చెప్పారు. భోజన సదుపాయం, బస్సుల పార్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని, డీ ౖహైడ్రేషన్‌కు గురికాకుండా చూడాలన్నారు. మైదానం పరిసరాల్లో తాగునీటి సమస్య, మురుగుకాలువల నుంచి దుర్వాసన లేకుండా చూడాలన్నారు. మైదానం ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, టీడబ్ల్యూ డీడీ రజని, ఈఈ వేణుగోపాలరావు, డిఈవో బ్రహ్మాజీరావు, ఏసీపీ స్వామి నాయుడు, గురుకులం ఓఎస్‌డీ మూర్తి, ఆర్టీసీ డీఎం ఉమా మహేశ్వరరావు, రవాణాశాఖాధికారి లీలా ప్రసాద్, యోగ గురువు పతంజలి శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో లవరాజు పాల్గొన్నారు.
ఏప్రిల్ 7న 20 వేల మంది విద్యార్థులతో యోగభ్యాసన
కలెక్టర్ దినేష్‌కుమార్