
స్వర్ణాభరణ అలంకరణలో కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఉగాది పురస్కరించుకుని ఆదివారం అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారు స్వర్ణాభరణాలు, పట్టుచీరలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గణపతి పూజ, మండపారాధన, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, పంచాంగ పుస్తకాలు వితరణ చేశారు. ఆలయ ఏఈవో కె.ఎస్.తిరుమల్లేశ్వరరావు, పర్యవేక్షణాధికారి తిరుపతిరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.