
ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి
పెదబయలు: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని నూరుశాతం విస్తరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నందు, జిల్లా ప్రకృతి వ్యవసాయం మేనేజర్ భాస్కరరావు అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 2028 సంవత్సరం పూర్తయ్యేనాటికి పాడేరు డివిజన్‌లోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేసేలా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ఈనెల 15వ తేదీ నాటికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, పోషణను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకర పంటలు పండించే విధంగా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ రహీమ్, ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య, తహసీల్దార్ గండేరు రంగారావు, వెలుగు ఏపీఎం దేవమంగ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉపాధి ఏపీవో అప్పలనాయుడు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, కాఫీ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం 32 రకాల విత్తనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు.