
రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి
జీసీసీ గోడౌన్ వ్యవహారంపై పీవో సీరియస్
చింతూరు: స్థానిక జీసీసీ గోడౌన్‌లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ బుధవారం రాత్రి గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గోడౌన్ తాళం చెవులను ఇన్‌చార్జికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని గురువారం మేనేజర్‌కు అప్పగించారు. కాగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పీవో గోడౌన్‌లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని తొలగించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై పీవోను వివరణ కోరగా గోడౌన్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అవకతవకలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రమాద స్థలంలో మృతి చెందిన బోడేశ్వరరావు, బోడేశ్వరరావు (ఫైల్)
గూడెంకొత్తవీధి: మండలంలోని దేవరాపల్లి పంచాయతీ కొడిసింగి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీకే వీధి మండలం లక్కవరపుపేట పంచాయతీలో ఉన్న తన తల్లిని కలిసి తన కుటుంబం ఉంటున్న కొడసింగి గ్రామానికి ద్విచక్రవాహనంపై కంకిపాటి బోడేశ్వరరావు(32) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొడసింగి గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనం అదుపు తప్పి సమీప పొదల్లో దూసుకుపోవడంతో బోడేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. జీకే వీధి సీఐ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి