
హెచ్‌ఎస్‌ఎల్‌లో నేషనల్‌మారిటైమ్ డే వేడుకలు
సింథియా(విశాఖ): హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థలో నేషనల్ మారిటైమ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక షిప్‌యార్డ్, మొదటి విమాన కర్మాగారం, మొదటి కార్ ఫ్యాక్టరీని స్థాపించిన సేథ్ వాల్‌చంద్ హీరాచంద్ దోషిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. నేషనల్ మారిటైమ్ డేను పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన సీఐఐ–యంగ్ ఇండియన్స్ సభ్యులతో కూడిన 25 మంది షిప్‌యార్డ్‌ను సందర్శించగా, వారికి సంస్థకు చెందిన అధికారులు పలు అంశాలను వివరించారు. 1919వ సంవత్సరం ఏప్రిల్ 5న సింథియా స్టీమ్ నావిగేషన్ మొదటి భారతీయ ఓడ ఎస్‌ఎస్ లాయల్టీ ముంబై నుంచి లండన్ వరకు ప్రయాణించిందని, నాటి స్ఫూర్తితో ఆత్మ నిర్భర్ భారత్‌కు అనుగుణంగా ఆధునిక నౌకలను నిర్మించడం ద్వారా సేథ్ వాల్‌చంద్ హీరాచంద్ దోషి కలలకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.