
ఏయూను సందర్శించినవిదేశీ ప్రతినిధులు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రిపబ్లిక్ ఆఫ్ అంగోలా రాయబారి ఎక్స్‌లెన్సీ క్లెమెంటే కామెన్హా శనివారం సందర్శించారు. వీసీ ఆచార్య రాజశేఖర్‌ను కార్యాలయంలో కలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో చదువుతున్న అంగోలాకు చెందిన 46 మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా సౌకర్యాలు కల్పించినందుకు క్లెమెంటే కామెన్హా సతీమణి మరియా, మినిస్టర్ కౌన్సిలర్ అబెల్ మావుంగో ఏయూ వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున జ్ఞాపిక అందజేసి సత్కరించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు తెలిపారు.