
పట్టపగలే దోపిడీ యత్నం
నెల రోజుల క్రితం ముషిడిపల్లి నుండి ఆనందపురంలోని బట్టల షాపునకు వెళ్లేందుకు జంక్షన్ వరకు కాలినడకన బయలుదేరాను. ఉదయం 10 గంటల ప్రాంతంలో నాగారాయుడు చెరువు మలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ముఖానికి గుడ్డలు కట్టుకొని జంక్షన్ వరకు తమ బండి ఎక్కాలని కోరగా తిరస్కరించాను. దీంతో బైక్‌పై ముందున్న వ్యక్తి నా మెడలోని అర తులం బంగారు మంగళ సూత్రాలను లాగి తెంచేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకొని మంగళసూత్రాలను గట్టిగా పట్టుకున్నాను. బైక్ ఉన్న మరో వ్యక్తి తన చెవులకు ఉన్న బంగారు రింగ్‌లను లాగేందుకు ప్రయత్నించగా గట్టిగా చేతి గోర్లతో రక్కేయడంతో విడిచి పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించి గట్టిగా హారన్ కొట్టుకుంటూ వేగంగా రావడంతో ఇద్దరు దుండగులు బైక్‌పై పరారయ్యారు. నాకు మెడపైన, బుగ్గపై చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడతానని ఆనుకోలేదు.
–బత్తిన మంగ, బాధిత మహిళ, ముషిడిపల్లి.
Comments
Please login to add a commentAdd a comment