
● జంక్షన్‌కు వెళ్లే దారిలో పట్టపగలే రెచ్చిపోతున్న దొంగల
దేవరాపల్లి : ముషిడిపల్లి గ్రామం నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లే రహదారిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలతో పాటు పురుషులను సైతం టార్గెట్‌గా చేసుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామం నుంచి ఈ జంక్షన్ సుమారు రెండు కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో పాటు జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటుగా వచ్చేవారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగు వేసుకొని అటుగా వచ్చే వారిని అడ్డగించి బ్యాగుల్లో నగదుతో పాటు ఒంటిపై గల ఆభరణాలను దోచుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రతిఘటించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి ఈ తరహా సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురిపై ఈ తరహా దాడులు జరిగినట్టు సమాచారం. తాజాగా ఈనెల 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్‌పై వస్తున్న యువకుడిని అడ్డుకొని దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ముషిడిపల్లి నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లేందుకు మహిళలతో పాటు గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. ముషిడిపల్లితో పాటు కె.ఎం.పాలెం, ఎ.కొత్తపల్లి గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగానే ఇటు దేవరాపల్లి, అటు ఆనందపురం, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇపుడు ఈ రహదారిలో దారిదోపిడీ ఘటనలతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. కాగా ఆయా ఘటనల నుంచి తప్పించుకున్న ముషిడిపల్లి గ్రామానికి చెందిన బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ముషిడిపల్లిలో
దారి దోపిడీల కలకలం

● జంక్షన్‌కు వెళ్లే దారిలో పట్టపగలే రెచ్చిపోతున్న దొంగల
Comments
Please login to add a commentAdd a comment