24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు
తుమ్మపాల: ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు చేపట్టే సమ్మెకు మద్దతిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించినట్లు జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు తెలిపారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాలని ప్రయత్నిస్తోందన్నారు. బ్యాంకుల సంఖ్యను తగ్గించి ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెంచుతుందని, పారిశ్రామికవేత్తల అప్పులు మాఫీ చేస్తూ బ్యాంకుల నెత్తిన భారం మోపుతుందని తెలిపారు. ఈ చర్యలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలను ఉపసంహరించాలని, పలు డిమాండ్లతో యూఎఫ్‌ఏయూ నాయకత్వంలో ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment