నాన్ జ్యుడీషియల్ స్టాంపులు కావలెను!
అనంతపురం టౌన్: జిల్లాలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు నిండుకున్నాయి. రెండు నెలలుగా సమస్య నెలకొంది. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజూ పదుల సంఖ్యలో స్థిరాస్తుల క్రయ, విక్రయాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ క్రమంలో జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేక రిజిస్ట్రేషన్లు సైతం నిలిచిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఈ స్టాంపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినా, దీనిపై వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. రూ.100, రూ. 50 స్టాంపులు లేక నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదు.
ఆదాయం కోల్పోతున్న వైనం..
జిల్లాలో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల విక్రయాలతో రిజిస్ట్రేషన్ శాఖకు నెలకు దాదాపు రూ.2 కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది. రామ్నగర్ ప్రధాన కార్యాలయంలోని స్టాంపుల విక్రయ కేంద్రంలోనే నెలకు రూ.1.50 కోట్ల విలువ చేసే స్టాంపులను విక్రయించే వారు. రెండు నెలలుగా స్టాంపులు లేకపోవడంతో విక్రయ కేంద్రం బోసిపోతోంది. ప్రధానంగా జిల్లాలో గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అధిక సంఖ్యలో స్థిరాస్తుల క్రయ, విక్రయాలు జరుగుతాయి. స్టాంపులు లేని కారణంగా రిజిస్ట్రేషన్లు సైతం గతంతో పోలిస్తే భారీగా తగ్గిపోయాయి. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా ఇండెంట్ పంపామని, రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్టాంపులు సరఫరా చేస్తామని తెలిపారు.
అందుబాటులో లేని రూ.100, రూ. 50 స్టాంపులు
జిల్లాలో రెండు నెలలుగా దుస్థితి
వినియోగదారులకు తీవ్ర ఇక్కట్లు
Comments
Please login to add a commentAdd a comment