వేగవంతంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు | - | Sakshi
Sakshi News home page

వేగవంతంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు

Published Wed, Jan 29 2025 1:15 AM | Last Updated on Wed, Jan 29 2025 1:15 AM

వేగవంతంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు

వేగవంతంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి కేశవ్‌

అనంతపురం సెంట్రల్‌: కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌ వరకూ హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో హంద్రీనీవా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు. తర్వాత డ్రోన్‌ ద్వారా ఫొటోలు తీయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు సీఎంఎస్‌ఎస్‌లో నమోదు చేయాలన్నారు.కాలువ వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. 33,34 ప్యాకేజీల్లో కూడా జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉరవకొండ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హంద్రీ–నీవా కర్నూలు ఎస్‌ఈ వరప్రసాద్‌, భూసేకరణ ఎస్‌డీసీ మల్లికార్జున, గుంతకల్లు ఈఈ శ్రీనివాస్‌నాయక్‌, ఈఈ చంద్రశేఖర్‌, ట్రాన్స్‌కో ఈఈ శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement